Advertisement
ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు తెలియని వారుండరు. ప్రస్తుతం వైసీపీ సర్కార్ లో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించాలంటే ఈయన తర్వాతే ఎవరైనా. ఎదుటి వ్యక్తిని తన మాటల గారడీతోనే గప్ చుప్ చేస్తారని వైసీపీ వర్గాల్లో ఈయనకు పేరుంది. అయితే.. ప్రతిపక్షాలు ఈయన్ను సంబరాల రాంబాబు అని ముద్దుగా పిలుచుకుంటాయి. ఆయన వాయిస్ లా ఉన్న కొన్ని ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు బాగా పాపులర్ అయింది.
Advertisement
ఈమధ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ సభలో పాల్గొన్నా.. సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవ చేస్తూనే ఉన్నారు. టీడీపీ నేతల సంగతి సరేసరి. ఆయన్ను ఓ రేంజ్ లో ఆడుకుంటూ ఉంటారు. అయితే.. అంబటి రాంబాబు సమయం వచ్చినప్పుడల్లా కాలు కదుపుతుంటారు. తనదైన రీతిలో స్టెప్పులేసి ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ సారి సంక్రాంతి సందర్భంగా ఆయన వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. అయితే.. భోగి సందర్భంగా సత్తెనపల్లిలో మంత్రి అంబటి స్థానికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో బంజారా స్టెప్పులతో అదరగొట్టారు. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో పాల్గొన్న యువత కేరింతలు కొడుతూ మద్దతు పలికారు. డప్పు కళాకారులు బంజారాలతో కలిసి భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ.. డాన్స్ లు చేస్తూ పండుగను ఆస్వాదించారు. వారితో అంబటి జత కలిసారు.
అంబటి డాన్స్ పైన పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు చేస్తున్నారు నెటిజన్స్. పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సంబరాల రాంబాబు అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇటు సక్రాంతి లక్కీ డ్రా విషయంలో విమర్శల పాలయ్యారు మంత్రి. అయినా ఆయన దేనికీ తగ్గేదే లేదంటున్నారు.