Advertisement
ఏపీలో కొన్నాళ్లుగా కాపుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ, జనసేన మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఇరు పార్టీలకు చెందిన కాపు నేతలు ఎవరు ద్రోహులు అనే అంశం చుట్టూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. జనసేనకు మద్దతుగా ఉన్న కాపు ఉద్యమ నేత హరి రామ జోగయ్య కూడా వైసీపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కాపు నాయకుల్ని కొద్ది రోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అమర్ నాథ్ కు ఓ లేఖాస్త్రం సంధించారు. దానికి మంత్రి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. తాజాగా మరోసారి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు అమర్ నాథ్.
Advertisement
ఉమ్మడి రాష్ట్రంలో కాపు లీడర్ గా బాగా ఫాలోయింగ్ సంపాదించారు వంగవీటి మోహన్ రంగా. ఇప్పుడు ఆయన హత్యను గుర్తు చేస్తూ హరిరామ జోగయ్యకు కౌంటర్ ఇచ్చారు అమర్ నాథ్. ‘‘వంగవీటి మోహన్ రంగా గారిని చంపించింది చంద్రబాబు నాయుడే అని మీరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ ను మీరు సమర్ధిస్తారా? స్పష్టం చేయగలరు’’ అంటూ మంత్రి అమర్ నాథ్ తాజా లేఖలో ప్రశ్నించారు.
Advertisement
కొద్ది రోజుల క్రితం అమర్ నాథ్ నువ్వో బచ్చా… సాధారణ మంత్రి పదవి కోసం అమ్ముడుపోయావు అంటూ ఘాటైన లేఖ రాశారు హరి రామజోగయ్య. ఈ లేక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జగన్మోహన్ రెడ్డికి బానిసగా మారావు, విజ్ఞత, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నావు అంటూ ఫుల్ ఫైరయ్యారు. ఈ మాటలు మంత్రిని బాగా హర్ట్ చేశాయి వెంటనే ఆయన కూడా రిటర్న్ కౌంటర్ లేఖ రాశారు.
‘‘కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ గారికి రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో పాటు, మానసికంగా దృఢంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అంటూ కౌంటర్ ఇచ్చారు అమర్ నాథ్. ఇప్పుడు మరోసారి అదే అంశంపై మరో లేఖాస్త్రం సంధించారు. ఈసారి వంగవీటి రంగా పేరును ప్రస్తావించడం కొత్త చర్చకు దారితీసింది.