Advertisement
సాధారణంగా తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి ఏది మాట్లాడిన దాంట్లో ఏదో ఒక చమత్కారం అయితే కచ్చితంగా ఉండే ఉంటుంది. చివరికీ అది ఆయనను అబాసుపాటు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో నిండు కుండలా కురుస్తున్న వర్షంపై కూడా ఆయన చేసిన కామెంట్స్ మళ్లీ ట్రోలింగ్ కి దారి తీశాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో అన్ని వరద నీటితో మునుగుతున్నాయి.
Advertisement
Advertisement
దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నరు. ఇలాంటి సమయంలో ఆచితూచి మాట్లాడాలి. కానీ పబ్బిక్ ఫైర్ కావడం కామన్ అయిపోతుంది. కానీ మంత్రి మల్లారెడ్డి మాత్రం ఇలాంటి సున్నితమైన అంశాలమీద నోరు జారారు. పిలిస్తే వాన వస్తుంది వద్దంటే వాన వస్తుంది, ఇయ్యాల నేను వాన దేవడిని దండం పెడుతున్న.. సాలె దేవుడా ఇక వానలు చాలు.. మా ప్రజలంతా అలకల్లోలం అవుతుండ్రు. వానలు వద్దు నాయన వద్దు నాయన మళ్లీసారి కొడుదువె నాయన ఈ సారి వద్దని దేవుడికి దండం పెట్టిన అని చెప్పుకొచ్చాడు మంత్రి మల్లారెడ్డి. ప్రస్తుతం మంత్రి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.