Advertisement
మంత్రి రోజా మీడియా ముందుకొచ్చారంటే.. ఛానళ్లకు పండగే. ఓ పూటకు సరిపడా స్టఫ్ ఇచ్చేసి.. హెడ్ లైన్స్ కు ఎక్కుతుంటారామె. టూరిజం మంత్రి అయ్యాక ఏదో ఒక ఆలయంలో, పర్యాటక ప్రదేశంలో కనిపిస్తూనే ఉంటున్నారు. అయితే.. ప్రతిపక్షాలు ఈ సందర్భంగా ఈమె టూరిజం మంత్రా? టూరిస్టా? అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. ఈ కామెంట్స్ పై తాజాగా రోజా స్పందించారు.
Advertisement
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్ అయిందని.. కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు రోజా. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 6 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. సదస్సుకు పారిశ్రామిక దిగ్గజాలు రావడాన్ని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని.. టీడీపీ గోబెల్స్ ప్రచారానికి ఈ సమ్మిట్ తో సమాధానం ఇచ్చామన్నారు.
Advertisement
సదస్సు జరిగిన తీరు చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యిందన్న రోజా.. అంబానీ, అదానీలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. కోవిడ్ లేకుంటే ఈ అభివృద్ధి ఎప్పుడో జరిగేదని తెలిపారు. కరెక్ట్ టైంలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించామని.. టూరిజం శాఖ కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం రెండు కమిటీలు వేశామని వెల్లడించారు.
ఇక, రోజా టూరిస్టా? టూరిజం మంత్రా? అని విమర్శలు చేసే వారికి ఇదే సమాధానం అని అన్నారామె. కాకినాడలో డెస్టినేషన్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని.. దేవభూమి సంస్థ ఆధ్వర్యంలో ఏపీలో రోప్ ప్రాజెక్టులు, విశాఖలో సఫారీ ప్రాజెక్టు రాబోతోందని వివరించారు. పిల్ల పిత్రే(లోకేష్) పెట్టుబడుల సదస్సును ఫేక్ సదస్సు అంటున్నారని.. కానీ, చంద్రబాబు ఈ స్థాయిలో ఏనాడైనా పారిశ్రామిక వేత్తలను ఒకే స్టేజ్ మీదకు తెచ్చారా? అని ప్రశ్నించారు రోజా.