Advertisement
ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలక నేతగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితమైన మనిషిగా, నగరి ఎమ్మెల్యేగా ఉంది రోజా. అయితే ఆంధ్ర రాజకీయాల్లో రోజా ఎంత కీలక నేతనో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఓవైపు రాజకీయాలలో ఎంతో విజయవంతంగా రాణిస్తూనే మరోవైపు, బుల్లితెరపై తన అభిమానులందరికీ అలరిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగుతూ, తన నవ్వులతో జబర్దస్త్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది రోజా. అయితే, ఇటీవల అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి రావడంతో, జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు రోజా. అయితే ఇదంతా పక్కన పెడితే, తాజాగా రోజా రాజకీయాలకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు విషయమేంటంటే రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో ఎదురుదెబ్బ తగిలింది. స్వయంగా తానే తమ పార్టీ కార్యకర్తలపై ఆరోపణలు చేసింది. తను లేకుండానే రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేసిన వ్యతిరేకవర్గంపై ఫైర్ అయింది రోజా.
Advertisement
తను లేకుండానే తనకు చెప్పకుండానే భూమి పూజ చేయటం పై బాగా ఆవేదన చెందింది. తన నియోజకవర్గంలో తనను బలహీస్తున్నారు అంటూ ఆందోళన చెందుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన నవ్వుకునేలాగా తనకు నష్టం కలిగేలా వైసీపీ నేతలు చేస్తున్నారని బాగా ఆవేదన చెందింది రోజా. దీంతో ఇలా అయితే రాజకీయాలు చేయడం కష్టం అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వటంతో, తను రాజకీయాలకు గుడ్ బై చెప్పనుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
READ ALSO : “ఈనాడు” రామోజీరావు ఓ సైకో..కొడుకు సుమన్ మరణం వెనుక ?