Advertisement
MLC Kavitha ఢిల్లీలో లిక్కర్ స్కాం కేసులో కవిత విచారణకు టైమ్ అయింది. సోమవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఆమె ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. అయితే.. ఈసారన్నా ఆమె ఈడీ ఆఫీస్ కు వెళ్తారా? ఒకవేళ వెళ్లకపోతే ఈడీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? ఇలా ఎన్నో డౌట్స్ తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో అన్న కేటీఆర్, భర్త అనిల్, ఎంపీ సంతోష్ తో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లారు కవిత.
Advertisement
విచారణ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందనేది కవిత వాదన. ఈ క్రమంలోనే ఆమె తన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ, స్టే కు కోర్టు నిరాకరించింది. దీనిపై 24న విచారణ జరగనుంది. ఈలోపు 16న విచారించాలని అధికారులు నోటీసులు ఇచ్చినా సుప్రీం పిటిషన్ ను సాకుగా చూపి ఆమె వెళ్లలేదు. దీంతో 20న హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
Advertisement
సుప్రీంకోర్టులో తమకు తెలియకుండా కవిత మరో పిటిషన్ దాఖలు చేసి తీర్పులు తీసుకోకుండా ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో తప్పకుండా విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులతో కలిసి ఆమె హస్తినకు వెళ్లారు. ఆదివారం ప్రగతి భవన్ లోనే ఉన్న కవిత.. కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఏం కగారు పడొద్దు బిడ్డ అంటూ కేసీఆర్ ఆమెకు ధైర్యం చెప్పారని తెలుస్తోంది.
అయితే.. కవితను అరెస్ట్ చేసేందుకే ఈడీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. గత విచారణకు రాకపోవడంతో రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబుతో పాటు సిసోడియాను కలిపి విచారిస్తారని అంటున్నారు. నగదు బదిలీలు, బినామీల వ్యవహారంపై ఈడీకి ఇప్పటికే ఓ స్పష్టత రావడంతో అరెస్ట్ చేసి విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నట్లు ఓ చర్చ జరుగుతోంది. చూడాలి సోమవారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.