Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎన్నో సూపర్ హిట్స్ ని కొట్టారు. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అటు మోహన్ బాబు కూడా పెద్ద హీరో. ఆయన కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న బ్యానర్ పై కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడుగారు సినిమా వచ్చింది అల్లుడుగారు సినిమా చేసి జగదేకవీరుడు రికార్డులని బద్దలు కొట్టాలని రాఘవేంద్రరావు భావించారు.
Advertisement
అల్లుడుగారు కథను చిరంజీవికి వినిపించారు తర్వాత మూవీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో చిరంజీవి నుంచి రాఘవేంద్రరావుకి కబురు వచ్చింది. ఈ సినిమా చేయొద్దని.. ఎందుకంటే సినిమా కథ ప్రకారం క్లైమాక్స్ లో హీరోకు ఉరి శిక్ష పడుతుందని.. అలా ఉరి శిక్ష పడితే అభిమానులకి నచ్చదని.. క్లైమాక్స్ ని మారిస్తే కథ మొత్తం మారిపోతుందని చెప్పారు. దీంతో చిరంజీవి ఆయన చెప్పిన దానికి ఒప్పుకున్నారు.
Advertisement
Also read:
సినిమా కథ మొత్తం క్లైమాక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కథని మార్చలేము కనుక ఈ సినిమాని వదులుకున్నారు. మోహన్ బాబుని హీరోగా ఎంచుకున్నారు రాఘవేంద్రరావు. ఈ సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి మోహన్ బాబుతో పాటుగా ఈ మూవీలో శోభన, సత్యనారాయణ, చంద్రమోహన్ వంటి నటులు నటించారు. అతి పెద్ద హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాతో మోహన్ బాబు దశ తిరిగిపోయింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!