Advertisement
చాలామంది ఇళ్లల్లో మొక్కలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో మనీ ప్లాంట్ ని కూడా పెంచుతారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుందని అంటారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే జీవితంలో పురోగతి కీర్తి మొదలైన వాటికి అడ్డు ఉండదు. ఇంట్లో సరైన దిశలో మనీ ప్లాంట్ ఉంటే శుక్రుడు కూడా సంతోషిస్తాడు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలానే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే మొక్క దాని ప్రయోజనాలని పొందుతుంది.
Advertisement
ఇంట్లో వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్క ఉంచాలని పండితులు అంటున్నారు. మనీ ప్లాంట్ మొక్క ఆగ్నేయ దిశలో ఉంటే మంచిదట. ఎందుకంటే ఈ దిశకు అధిపతి వినాయకుడు అలానే ప్రతినిధి శుక్రుడు. గణేషుడు అన్ని కష్టాలను అడ్డంకులని తొలగిస్తాడు. శుక్రుడి ఇంట్లో సంపద శ్రేయస్సు గౌరవం పెంచుతుంది. అందుకని ఈ మొక్కని ఎప్పుడూ ఇంట్లో ఆగ్నేయ వైపు నాటాలి. ఇలా చేయడం వలన ధనానికి లోటు ఉండదు.
Advertisement
Also read:
Also read:
సకల అరిష్టాలు తొలగిపోతాయి. ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడు నాటొద్దు. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశకు అధిపతి బృహస్పతి. అలానే మనీ ప్లాంట్ శుక్రుడుకి సంబంధించింది బృహస్పతి శుక్రగ్రహాల మధ్య చెడు సంబంధం కారకంగా ఈ దిశలో మని ప్లాంట్ ఉంటే సమస్యలు వస్తాయి. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతున్నట్లయితే వెంటనే వాటిని తొలగించడం మంచిది. ఇంట్లో ఆఫీసులో కూడా మనీ ప్లాంట్ ని పెంచుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా ప్రయోజనాలు పొందవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!