Advertisement
సమాజంలో రోజురోజుకు దుర్మార్గుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల కనబడితే చాలు కొందరు మానవ మృగాలు… అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక అటు.. కొంతమంది ఆడపిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే చంపేస్తున్నారు లేదా పుట్టకుండా చేస్తున్నారు. మగ పిల్లలే తమకు కావాలంటూ… చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా, ఆడపిల్లకు జన్మనిస్తుంది అనే కారణంతో అత్తమామలు కోడలిపై విషప్రయోగం చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ ఇటీవల ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Advertisement
పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాలోని సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన గాడిపర్తి వేనుతో, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన శ్రావణికి 2020 లో వివాహమైంది. 2021 లో శ్రావణి మొదటిసారి గర్భవతి అయింది. తమకు త్వరలో వారసుడు వస్తాడని వేణు తల్లిదండ్రులు ఆశగా ఉన్నారు. అలాంటి సమయంలో శ్రావణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వేణు తల్లిదండ్రులు కొంత నిరుత్సాహానికి గురైనట్లు సమాచారం. అయితే ఈసారైనా కొడుకు పుడతాడులే అని ఆశతో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల కొన్ని నెలల క్రితం శ్రావణి రెండోసారి గర్భం దాల్చింది.
Advertisement
అయితే ఈసారి భర్త, అత్తమామలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. రెండోసారి కూడా అమ్మాయి పుడుతుందని తెలుసుకున్నారు. దీంతో శ్రావణి అత్తమామలు తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం. మరోసారి ఆడబిడ్డ ఇష్టం లేని అత్తమామలు మజ్జిగ, పాలల్లో విష ప్రయోగం చేశారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా శ్రావణి రక్తంతో వాంతి చేసుకుంది. దీంతో శ్రావణి ఆరోగ్య పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న సమయంలో కోమాలోకి వెళ్లిన శ్రావణి పరిస్థితి విషమించటంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
Read also: ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్ చేశారంటే అస్సలు నమ్మరుగా !