Advertisement
ప్రతి ఇంటా కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ముఖ్యంగా అత్త కోడల మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పదే పదే తిట్టుకోవడం, ఏదో ఒక విషయంలో గొడవ పడడం వంటివి ప్రతి ఇంట్లో కూడా చోటు చేసుకునేవే. కానీ ఈ అత్త కోడలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమీషాకి కిడ్నీ సమస్య ఉంది. కోడలు బతకాలని అత్త కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చింది. కిడ్నీ ఇచ్చి అత్త ప్రభ కోడల ప్రాణాన్ని కాపాడింది. అప్పటివరకు అంతా బాగానే ఉంది అమిషా హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది.
Advertisement
Advertisement
ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షలు చేశారు. కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించారు. రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే వ్యాధి మొదటి దశలో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించి, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే బతికే అవకాశం ఉందని తెలిపారు. తన భర్త జితేష కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. కానీ షుగర్ ఉంది అని కిడ్నీ డొనేట్ చేయడం కుదరదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు అత్త ప్రభ కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకొచ్చింది. ఆమెకి 70 ఏళ్ళు. తన కోడలి ప్రాణాన్ని కాపాడుకోవడానికి అమీషా ముందుకు వచ్చి, కిడ్నీ డొనేట్ చేసింది ఆపరేషన్ సక్సెస్ అయింది ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Also read: