Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా కొన్నేండ్ల పాటు అందరినీ అలరించారు జగపతిబాబు. అలాంటి ఆయన తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హీరో జగపతిబాబు విలన్,తండ్రి పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నిజం చెప్పుకోవాలంటే ఆయన హీరో కంటే విలన్ పాత్రల్లోనే బాగా నటిస్తున్నారని చెప్పవచ్చు. బాలకృష్ణ నటించిన లెజెండ్ అనే సినిమా ద్వారా తొలిసారి విలన్ పాత్ర చేసి అదరగొట్టేసారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు.
Advertisement
also read:వేల కోట్ల ఆస్తులకి వారసురాలైన అక్కినేని అమల ఆమె మేడలో తులం బంగారం కూడా ఎందుకు పెట్టుకోరంటే ?
Advertisement
అలాంటి జగపతిబాబు తాజాగా తన తల్లి ఉంటున్న ఇల్లును చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, తన తల్లి మాత్రం సింపుల్గా జీవిస్తున్నారు. పెద్ద ఖాళీ స్థలంలో అందంగా పెరిగిన చెట్ల నడుమ చిన్న పొదరిల్లు లాంటి ఇంట్లో ఆమె నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లో దానికి ఇరువైపుల పూల మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. పూర్వకాలంలో మునులు తపస్సు చేసే వనం లాగా ఉంది. అంతేకాకుండా ఇంటి ముందు మునీశ్వరుడు కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.
also read:అన్నా.. కలిసి పోరాడుదాం..!
ఈ ఇల్లు హైదరాబాద్ నడి ఒడ్డులో ఉందని చెప్పిన జగపతిబాబు ఏ ఏరియాలో ఉందనేది మాత్రం చెప్పలేదు . అయితే శ్రీరామనవమి సందర్భంగా తన తల్లిని కలవడం కోసం వెళ్లాడు. తన తల్లి ఉంటున్న ప్లేస్ కు వచ్చాను . అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ప్లేస్ అంతా అడవి లాగా ఉంటుంది కానీ హైదరాబాద్ నడిఒడ్డులో ఉంది. అమ్మ పానకం ఇస్తా రా.. అంటే వచ్చాను అంటూ జగపతి బాబు తెలియజేశారు. అమ్మ ఉండే ప్రదేశం ఒకే రూమ్. చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక యోగి యోగిని అంటారే ఆ టైపులో సెటిల్ అయిపోయింది. ఓకే బాయ్ బాయ్ అంటూ జగపతిబాబు తన తల్లి ఇంటి గురించి పరిచయం చేశారు.
also read:పుట్టపర్తి మే సవాల్!