Advertisement
ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా మంది సెలెబ్రిటీలనే దూరం చేసుకుంది. కారణాలు వేరైనా.. ఈ ఏడాదిలో చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు పరిశ్రమకు దూరం అయ్యారు. మరణం అనేది ఎవరికైనా అనివార్యమే. అయితే.. సెలెబ్రిటీలు మరణానికి చేరువైతే.. ఎక్కువమందికి దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ ఏడాది సినిమా పరిశ్రమకు దూరమైన టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎవరో ఓ లుక్ వేయండి.
Advertisement
తారకరత్న:
ఈయన ఫిబ్రవరి 28 న గుండెపోటుతో మరణించారు. బెంగళూరు లోని నారాయణ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన లోకాన్ని వీడారు.
జమున:
మొన్నటి తరం హీరోయిన్ జమున వయసు పైబడడంతో జనవరి 27 వ తేదీన మరణించారు.
కె విశ్వనాథ్:
వయసు పైబడడం, ఇతర అనారోగ్య కారణాల వలన కళాతపస్వి కె విశ్వనాథ్ ఫిబ్రవరి 2వ తేదీన శివైక్యం చెందారు.
రాజ్ కోటి:
Advertisement
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కోటి అనారోగ్య సమస్యలతో మే 21 వ తేదీన పరమపదించారు.
రాకేష్ మాస్టర్:
సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ అనారోగ్య కారణాలతో జూన్ 18న మరణించారు.
శరత్ బాబు:
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లో దాదాపు నెల రోజుల పాటు చికిత్స తీసుకుని కోలుకోలేక మరణించారు.
చంద్రమోహన్:
సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పైబడడంతో సినిమాలకు కూడా దూరం అయిన ఈయన నవంబర్ 12వ తేదీన మరణించారు.
Read More:
మర్యాద రామన్న మూవీలో ఈ సీన్ చూడండి..బిగ్ మిస్టేక్.. ఎలా మిస్సయ్యారు జక్కన్న..!!