Advertisement
2022 సంవత్సరం మన టాలీవుడ్ కు అస్సలు వచ్చి రావడం లేదు. ఈ సంవత్సరం మహేష్ బాబు కుటుంబానికి చాలా చెత్త సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం లో రమేష్ బాబు, ఇందిరా గారు మరియు ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయారు. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలోకి నెట్టివేయబడింది. ఈ ముగ్గురు కాదు కొందరు తెలుగు వారు మరియు వారి ఆకస్మిక మరణం వారి,వారి కుటుంబ సభ్యులను, అభిమానులను మరియు ఇతరులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, చనిపోయిన తరవాత విడుదలైన టాప్ హీరోల సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ తర్వాత ఆయన చివరిగా మనం అనే సినిమాలో నటించారు. నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఈ సినిమా విడుదల కాగా, సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీకి ఇది ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
సహజ నటి సౌందర్య ఎవరు ఊహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. అయితే అప్పటికే సౌందర్య ఆప్తమిత్రుడు, శివ్ శంకర్ అనే సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలు సౌందర్య చనిపోయిన తర్వాత విడుదలయ్యాయి.
Advertisement
ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దివ్య భారతి కూడా అర్ధాంతరంగా తనవు చాలించింది. అయితే చనిపోయే నాటికి దివ్యభారతి కూడా తొలిముద్దు అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దాంతో దివ్యభారతి మరణించిన తర్వాత ఈ సినిమాను విడుదల చేశారు.
ప్రముఖ హీరోయిన్ ప్రత్యూష కూడా అర్ధాంతరంగా మరణించింది. ఇక ప్రత్యూష కూడా చనిపోయే నాటికి సౌండ్ పార్టీ. ఈ సినిమాను ప్రత్యూష చనిపోయిన రెండు సంవత్సరాల తర్వాత విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆ***త్య చేసుకుని అందరిని షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ చనిపోయే నాటికి దిల్ బెచారా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక ఈ సినిమాను సుశాంత్ చనిపోయిన 40 రోజులకే విడుదల చేయగా, సూపర్ హిట్ గా నిలిచింది. సుశాంత్ అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
Also Read: MS ధోనినా మజకా..మిస్టర్ కూల్ చాణక్యంతో వరల్డ్ కప్ హీరో అయ్యాడు!