Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లతో సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అనుకుంటారు అందరూ. కానీ అవే సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కూడా వస్తాయి. అలా ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీ నష్టాలు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు చూద్దాం.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
#1 అజ్ఞాతవాసి
పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నభూతో అనే అంచనాలు ఉన్నాయి. కానీ విడుదల తర్వాత నాభవిష్యతి అనేలా ఫ్లాప్ అయిపోయింది అజ్ఞాతవాసి. దాదాపు 55 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.
#2 బ్రహ్మోత్సవం
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తిరకెక్కించిన బ్రహ్మోత్సవం 40 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చింది. ఆ దెబ్బకు ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోయాడు శ్రీకాంత్.
#3 శక్తి
మెహర్ రమేష్ తేరకు ఎక్కించిన ఈ చిత్రం తెచ్చిన నష్టాల నుంచి బయటపడటానికి అశ్విని దత్ లాంటి అగ్ర నిర్మాతకు కూడా ఏడేళ్లు పట్టిందంటే శక్తి శాక్ అర్థం చేసుకోవచ్చు. జూనియర్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్.
#4 తుఫాన్
అప్పటివరకు వరుస విజయాలతో దూసుకుపోతూ మినీమమ్ గ్యారంటీ హీరోగా ఉన్న రామ్ చరణ్, తుఫాన్ సినిమాతో చెత్త రికార్డు అందుకున్నాడు. ఈ చిత్రం దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది.
Advertisement
#5 రెబల్
ప్రభాస్ కెరియర్ లో అత్యధిక నష్టాలు తీసుకువచ్చిన సినిమా రెబల్. అప్పట్లో ఈ చిత్రంపై లారెన్స్ తో గొడవ పడ్డారు. నిర్మాతలు భగవాన్, పుల్లారావు.
#6 ఒక్క మగాడు
బాలయ్య కెరీర్ లో దారుణంగా నిరాశపరిచిన సినిమా ఒక్క మగాడు. అప్పట్లో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. కానీ విడుదలైన తర్వాత దారుణంగా ముంచేసింది ఒక్క మగాడు.
#7 స్పైడర్
మహేష్ బాబు, మురుగదాస్ లాంటి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 50 కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చిన సినిమా స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.
#8 షాడో
వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ ఎక్కించిన ఈ చిత్రం ఏడేళ్ల కిందే 20 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది.
#9మన్మధుడు 2
నాగార్జున కెరీర్లో కేడి సినిమాను మించిన డిజాస్టర్ గా మన్మధుడు 2 నిలిచింది. అనవసరంగా పాత మన్మధుడు ఇమేజ్ దెబ్బతీశారని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పై విమర్శలు కూడా వచ్చాయి.
#10 కొమరం పులి
పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి పదేళ్ల కిందే పాతిక కోట్ల నష్టాలు తీసుకొచ్చింది.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?