Advertisement
ఈరోజుల్లో సినిమాలు వచ్చిన తర్వాత సినిమాలు కాపీ అని ఆరోపణలు చేస్తున్నారు అయితే సినిమా హిట్ అయిన కొన్ని నెలల తర్వాత కాపీ అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. అలా చాలా సినిమాలకి కామెంట్స్ వినిపించాయి మరి నిజంగా ఆ సినిమాలని కాపీ కొట్టారా..? లేకపోతే అలా చెప్తున్నారా వాటి వెనక కారణాలేంటి అనేది చూద్దాం..
Advertisement
- మగధీర
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా రిలీజ్ అయిన టైంలో ఈ సినిమా చండరి అనే నవల ని కాపీ కొట్టారని కామెంట్లు వినిపించాయి చందేరి నవలని 80% పోలి ఉందని అభిప్రాయాలు వచ్చాయి.
2. శ్రీమంతుడు
అలానే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా మహర్షి సినిమా కథలు తనవేనని శరత్ చంద్ర సంచలన ఆరోపణలు చేశారు శ్రీమంతుడు సినిమాకి సంబంధించి ఇప్పటికే కోర్టు కేసు కూడా నడుస్తోంది.
3) బేబీ
అలానే బేబీ కథ విషయంలో కూడా చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి.
4) బలగం
ఇదే కాదు వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా గురించి కూడా ఒక జర్నలిస్ట్ కాపీ ఆరోపణలు చేశారు అయితే వేణు ఆ ఆరోపణలని ఖండించారు.
Advertisement
5) అఆ, గుంటూరు కారం
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ, గుంటూరు కారం సినిమాలు యుద్ధనపుడి సులోచన రాణి నవలల నుండి కాపీ కొట్టారని కామెంట్లు వచ్చాయి.
6) ఆచార్య
ఇక చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమా కూడా కాఫీ కొట్టారని ఆ కథ నాదే అని రిలీజ్ అయినప్పుడు రచయిత సైలెంట్ ఆరోపణలు చేశారు.
7) సింహా
బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన సింహా సినిమా కథ నాదే అని క్రెడిట్ ఇవ్వాలని కొరటాల శివ సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం తమ సినిమాలు కాపీ అని అంగీకరించిన సందర్భాలు అయితే లేవు. కొన్నిసార్లు అయితే దర్శకులు కావాలని కాపీ కొట్టకపోయినా ఇద్దరు రచయితల ఆలోచనలు ఒకేలా ఉండడం వలన ఈ విధంగా జరిగిందని కామెంట్లు వస్తున్నాయి భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరుగుతాయి అందులో డౌట్ లేదు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!