Advertisement
రకరకాల జోనర్స్ లో సినిమాలని తీస్తూ ఉంటారు. ప్రేమకథాచిత్రాలని, థ్రిల్లర్ సినిమాలని ఇలా. అయితే దేశభక్తి భావాన్ని గుండెల్లో నింపే సినిమాలు కూడా ఇప్పటికే చాలా వచ్చాయి. స్వాతంత్ర దినోత్సవం రోజు టీవీ పెడితే ఖడ్గం సినిమా ముందు కనపడుతుంది. అయితే అలా దేశభక్తిని నింపే సినిమాలు గురించి చూద్దాం. ఖడ్గం సినిమాల్లోని పాటలు ఎవర్ గ్రీన్. ముంబైలో జరిగిన దాడుల్లో చాలామంది చనిపోయారు దాని ఆధారంగానే ఈ సినిమాని తీసుకొచ్చారు కృష్ణవంశీ.
Advertisement
అలానే ముంబై దాడుల్లో మరణించిన సైనికుడు సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమాని తీసారు. యుద్ధ సమయంలో ఆయన చేసిన త్యాగాల గురించి ఈ సినిమాలో చెప్పారు దర్శకుడు శశికిరణ్ టిక్కా. అలానే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా దేశభక్తి ఉంటుంది. ఈ సినిమా 1920లో భారత దేశంలో స్వేచ్ఛ కోసం పోరాడిన ఇద్దరు వ్యక్తులు చరిత్ర కథ.
Advertisement
కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు ఎదిరించిన సంఘటనలని ఈ చిత్రంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో అందంగా చూపించారు. అలానే భారతీయుడు సినిమా కూడా దేశభక్తిని మనలో నింపుతుంది. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటించారు. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమా కూడా దేశభక్తిని నింపే సినిమా. అల్లూరి సీతారామరాజు, మేజర్ చంద్రకాంత్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా, సైరా నరసింహారెడ్డి, పరమవీరచక్ర వంటి సినిమాలు కూడా మంచి సినిమాలు.
Also read: