Advertisement
ఎమ్మెస్ నారాయణ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎమ్మెస్ నారాయణ అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందర్నీ ఫుల్లుగా నవ్వించారు. ఎలాంటి పాత్ర అయినా సరే తనదైన శైలిలో కామెడీ పండించే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తర్వాత ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే నటుడుగా పేరు తెచ్చుకున్నారు. చాలా మంచి పాత్రను పోషించి అభిమానులను ఆకట్టుకున్నారు. 17 ఏళ్ల కెరియర్లు దాదాపు 700 పైగా సినిమాల్లో నటించారు దర్శకుడు రవి రాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పని చేసి ఆ తర్వాత సినిమాల్లోకి నటుడిగా వచ్చారు. ఆ తర్వాత మా నాన్నకు మళ్ళీ పెళ్లి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
దర్శకుడుగా తన ప్రతిభ చాటుకున్నారు శ్రీను వైట్ల సినిమాల్లో ఎమ్మెస్ నారాయణ కామెడీ ప్రేక్షకుల్ని ఫుల్ గా నవ్వించింది. దుబాయ్ శీను, దూకుడు సినిమాల్లో ఆయన నటన థియేటర్లలో నవ్వులు పూయించింది. అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు ఎప్పుడైతే అనారోగ్యంతో ఆయన హాస్పిటల్ లో చేరారు అప్పుడే అభిమానులకి చివరి దశలో ఉన్నారని తెలిసింది.
Advertisement
Also read:
హాస్పిటల్ లో ఆయన చనిపోయే రెండు గంటల ముందు పేపర్ పై బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉందని రాశారట. ఈ విషయం తెలిసిన బ్రహ్మానందం పరుగు పరుగున ఆసుపత్రికి వచ్చారు. బ్రహ్మానందానికి ఎమ్మెస్ నారాయణ చెవిలో ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ అది ఆయనకు అంతగా అర్థం కాలేదట. బ్రహ్మానందం చెయ్యి గట్టిగా పట్టుకుని అన్నయ్య అని పిలిచాడు. ఆ స్థితిలో ఎమ్మెస్ ని చూడలేక బ్రహ్మానందం బయటకు వచ్చేసారట ఆయన వచ్చిన తర్వాత 15 నిమిషాలకి ఎమ్మెస్ నారాయణ కన్ను మూసారని ఒకానొక సందర్భంలో బ్రహ్మానందం చెప్పి బాధపడ్డారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!