Advertisement
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం టీడీపీ, జనసేన కూటమిలో చేరాలని నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో మరింత అగ్గి రాజేసింది. అయితే.. ఆయనను కాకినాడ సిటీ నుంచి పోటీకి దించాలి అంటూ టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ స్థానం కంచుకోట లాంటిది. అక్కడ పోటీ చేస్తే ద్వారంపూడి కచ్చితంగా గెలిచి తీరతారు. అయితే.. ముద్రగడ కాపులకు బ్రాండ్ అంబాసిన్దర్ లాంటోళ్ళు. ఆయన టీడీపీ వైపు వెళ్తారా, వైసీపీ వైపు వస్తారా? లేక న్యూట్రల్ గా ఉంటారా అన్న విషయమై నిన్న మొన్నటి వరకు చాలా చర్చలే జరిగాయి.
Advertisement
అయితే.. ముద్రగడ పద్మనాభం టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయనే చెప్పాలి. రాబోయే ఎన్నికల విషయంలో పొత్తులు, ఎత్తుల గురించి ఈ రెండు పార్టీలు చర్చించుకుంటున్నాయి. ఆయన ఇంకా జనసేనలోకి చేరక ముందే ఆయనను ఏ స్థానం నుంచి పోటీ చేయించాలి అన్న విషయమై టీడీపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ వర్గాలు కాకినాడ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నాయట.
Advertisement
ఇది ద్వారంపూడి కి కంచుకోటలాంటిది. అయితే.. ద్వారంపూడితో ఈ స్థానం లోనే గెలిచి చూపిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ శపధాలు కూడా చేసారు. ఈ శపధం నెరవేరి, పవన్ కోరిక తీరాలంటే ఆ స్థానంలో పోటీ చేయడానికి ముద్రగడ సరైన వ్యక్తి అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కాకినాడ వద్ద కాపు, గంగపుత్రుల కమ్యూనిటీ ప్రాబల్యం కొంత ఎక్కువగా ఉంటుంది. పొత్తులో ఈ సీటుని జనసేన అడిగినా.. టీడీపీ నుంచి పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం అవదు అని చర్చలు జరుగుతున్నాయి. అయితే.. అసలు కాకినాడ నుంచి పోటీ చేయడానికి ముద్రగడ ఇష్టపడతారా ? లేదా? అన్న సంగతి తెలియాల్సి ఉంది. త్వరలోనే పవన్ ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన్ని ఆహ్వానించనున్నారు.