Advertisement
ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ముందు మెగాస్టార్ ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ సినిమాకు కూడా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
Advertisement
ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడిగా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించి అలరించింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మూడు పాత్రలలో నటించి ఆకట్టుకున్నారు. పోలీస్ పాత్ర… దత్తాత్రేయ పాత్ర మరియు పృద్వి పాత్ర ఇక మూడు పాత్రలలో చిరు డిఫరెంట్ గా కనిపించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. అంతే కాకుండా మూడు పాత్రలకు మూడు రకాలుగా గొంతు మార్చి డబ్బింగ్ చెప్పడం సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది. సినిమాలో ముగ్గురిని చూపించాలి.
Advertisement
కాబట్టి రెండు పాత్రల కోసం డూపు ల అవసరం ఏర్పడింది. అయితే చిరంజీవికి డూప్ గా ఆయన వద్ద పిఎగా పనిచేస్తున్న సుబ్బారావు, నటుడు ప్రసాద్ రావు నటించారు. వారిద్దరి ఎత్తు బరువు చిరంజీవికి సరిపోవడం తో వాళ్లను ఈ సినిమా కోసం డూప్ లుగా తీసుకున్నారు. ఈ సినిమాకే కాకుండా మెగాస్టార్ కు డూప్ లుగా వీరిద్దరూ మరి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. ఇక ముగ్గురు మొనగాళ్లు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వం మెగాస్టార్ టాలెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
Read Also : స్టార్ డైరెక్టర్స్ వారి కెరీర్ లో వచ్చిన పరమ చెత్త సినిమాలు !