Advertisement
కష్టపడితే ఎప్పటికైనా విజయాన్ని సాధించవచ్చు అనే దాన్ని ఈ క్రికెటర్ నుంచి నేర్చుకోవచ్చు.ఏ పని చేసిన క్వాలిటీ ఉండాలి మరియు ఎంతో తపన ఉండాలి. దేన్నైనా ఎదుర్కొంటాను అనే ధీరత్వం ఉంటే ఆ వ్యక్తి ఎప్పటికైనా విజయాన్ని సాధించగలరు. మొహమ్మద్ సిరాజ్ టీమిండియా లో యంగ్ బౌలర్, అయితే భారత క్రికెట్ జట్టు లో ఎంపిక అవ్వడం అనేది రాత్రికి రాత్రి జరిగిపోలేదు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. మొహమ్మద్ సిరాజ్ జేబులో పది రూపాయలు లేని కటిక పేదరికం ఉండేది. ఆటో నడిపి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఎంతో కష్టపడ్డాడు. ఈ విధంగా టీమిండియా కు ఎంపిక అయ్యాడు మరియు టీమిండియా సాధించిన విజయాలలో తన పాత్ర ఎంతో కీలకం అని చెప్పవచ్చు. పైగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.
Advertisement
Advertisement
తెలంగాణ ప్రభుత్వం నుంచి డిఎస్పీ ఉద్యోగాన్ని మొహమ్మద్ సిరాజ్ దక్కించుకున్నాడు. ప్రభుత్వం డిఎస్పీగా నియమించిన నేపథ్యంలో తెలంగాణ డిజిపి నుంచి ఉత్తర్వులు స్వీకరించి బాధ్యతను చేపట్టాడు. మొహమ్మద్ సిరాజ్ పోలీస్ డ్రెస్ వేసుకుని చేతిలో లాఠీ పట్టుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read:
టీ 20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో మొహమ్మద్ సిరాజ్ కీలక సభ్యుడు, దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహమ్మద్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం కేటాయించాడు. అంతేకాక జూబ్లీహిల్స్ లో 600 చదరపు గజాల స్థానాన్ని కేటాయించడం జరిగింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం మొహమ్మద్ సిరాజ్ ను గ్రూప్ 1 అధికారిగా నియమించారు అని తెలియజేశారు.
తెలుగు స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!