Advertisement
చివరి నిజాం మీర్ అలీఖాన్ ముకర్రమ్ ఝా మరణంతో మరోసారి నిజాం ఆస్తులపై చర్చ జరుగుతోంది. టర్కీలోని ఇస్తాంబుల్ లో ఈయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోనే తనకు అంత్యక్రియలను నిర్వహించాలనేది ఆయన చివరి కోరిక. అయితే.. ఓసారి హిస్టరీ తిరగేస్తే..
Advertisement
హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1954 జూన్ 14న ముకర్రమ్ ఝాను తన వారసుడిగా ప్రకటించారు. ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతులకు 1933 అక్టోబర్ 6న జన్మించారు. ఈయన తల్లి టర్కీ చివరి సుల్తాన్(ఒట్టోమన్ సామ్రాజ్యం) సుల్తాన్ అబ్దుల్ మెజిద్ II కుమార్తె. ఆమె 2000 సంవత్సరంలో కన్నుమూశారు.
Advertisement
ముకర్రమ్ ఝాను నామమాత్రపు అధిపతిగానే ఆయన తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమించారు. అప్పటి నుంచి, ముకర్రమ్ హైదరాబాద్ 8వ నిజాంగా గుర్తించబడ్డారు. ఈయన వారసత్వాన్ని భారత ప్రభుత్వం సూత్రప్రాయంగానే గుర్తించింది. 1971లో రాజ భరణాలు రద్దు అయ్యాయి. అప్పటిదాకా ఈయన్ను అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు.
ముకర్రమ్ ఝాకు నలుగురు భార్యలు.. ఐదుగురు సంతానం. వారసత్వం ప్రకారం చూస్తే సగం హైదరాబాద్ ఈయనదే. చిన్నతనంలోనే ప్రపంచ కుబేరుడయ్యారు. కానీ, విలాసాలకు, ఆర్భాటాలకు పోయి చివరకు దివాలా తీశారు. దీనికితోడు కుటుంబంలో కలతలు, భార్యలతో గొడవల వల్ల ఆస్తి వివాదాలు చుట్టుముట్టాయి. ఈయన పిల్లలు కూడా ఆస్తి కోసం కేసులు వేశారు.
ఇటు హైదరాబాద్ లోని మేనత్తలు, వారి వారసులు కూడా కోర్టు మెట్లెక్కడంతో నగరంలోని ఆస్తులను అమ్మడానికి వీల్లేకుండా పోయింది. ఓ దశలో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా గడిపారని చెబుతుంటారు. చివరికి ఇస్తాంబుల్ లోని ఓ డబుల్ బెడ్రూం ఫ్లాట్ కే ఆయన పరిమితం అయ్యారని ఓ పుస్తకంలో ఉంది. ఈ బుక్ బాగా పాపులర్.