Advertisement
ఫేస్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ముఖచిత్రం’. రెండేళ్ల క్రితం హైదరాబాదులో భర్త ఫేస్ మార్ఫింగ్ చేసిన కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అలాంటి కథతోనే ఈ సినిమా రూపొందింది. ‘కలర్ ఫోటో’ తో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విశ్వక్సేన్ గెస్ట్ రోల్ లో, వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి గంగాధర్ దర్శకత్వం వహించారు.
Advertisement
కథ :
హైదరాబాద్ లో హ్యాండ్సమ్ డాక్టర్ రాజకుమార్(వికాస్ వశిష్ట), విజయవాడలో ట్యూషన్స్ చెబుతూ తండ్రి పొత్తిళ్లలో పెరిగిన అమాయకురాలు మహతి(ప్రియా వడ్లమాని), బ్లాగ్స్ రాస్తూ డైరెక్టర్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేసే ఆధునిక యువతి మాయ(ఆయేషా ఖాన్). ఈ ముగ్గురి నడుమ నడిచిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మహతి జీవితాన్ని ఎలా మార్చింది అనేది మూల కథ. ఆ మూల కథను మలుపు తిప్పిన అంశం ప్లాస్టిక్ సర్జరీ. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే ‘ముఖచిత్రం’ చూడాలన్నమాట.
Advertisement
సినిమా బండి చిత్రంలో అమాయక ఆటో డ్రైవర్ గా ఆకట్టుకున్న వికాస్ వశిష్ట, ఈ చిత్రంలో రాజ్ కుమార్ గా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో అలరించాడు. అతడి వాయిస్ అతనికి పెద్ద ప్లేస్ పాయింట్.కళ్ళల్లో, గొంతుకలో గాంబిర్యం బాగా కనబరిచాడు. ప్రియా వడ్లమాని రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో పర్వాలేదనిపించుకుంది. మహతి గా కాస్త ఇబ్బంది పడింది. కానీ మాయగా మాత్రం అల్లుకుపోయింది. లాయర్ వశిష్టగా రవిశంకర్ తనదైన శైలి స్క్రీన్ ప్రజెన్స్ తో దుమ్ము దులిపేశారు. ఫస్ట్ కేస్ లాయర్ గా విశ్వక్సేన్ అతిధి పాత్ర అనుకున్నంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీనటుల పెర్ఫార్మెన్స్
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
సీన్స్ కన్ఫ్యూజ్
లాయర్ గా విశ్వక్సేన్ సెట్ కాలేదు.
రేటింగ్: 2.5/5
READ ALSO : Dwayne Bravo : ఐపీఎల్ కు మరో విండీస్ వీరుడు గుడ్ బై..అంతలోనే బిగ్ ట్విస్ట్ !