Advertisement
నవంబర్ 3న తెలంగాణలోని మునుగోడు లో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేల ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి కీలక నేతలను టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చి ఆ పార్టీ నేత పల్లె రవికుమార్ దంపతులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
Advertisement
Read also: ఓటీటీలో విడుదలకానున్న కొత్త సినిమాలు ఇవే..!!
పల్లె రవి కుమార్ భార్య కళ్యాణి చండూరు కాంగ్రెస్ ఎంపీపీగా ఉన్నారు. తాజాగా వీరిని పార్టీ కండువా కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఇక ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిక్షమయ్య గౌడ్ పార్టీలో చేరారు. అయితే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి నాయకులు టిఆర్ఎస్ లో చేరుతున్నారని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు టిఆర్ఎస్ లో చేరగా.. తాజాగా బిజెపి నేత దాసోజు శ్రవణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత పార్టీ అయిన టిఆర్ఎస్ లోకి మళ్లీ దాసోజు శ్రవణ్ చేరనున్నారు.
Advertisement
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన దాసోజు శ్రవణ్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఈరోజు సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో మళ్లీ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఆయన బిజెపికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కి లేఖ కూడా రాశారు. వరుసగా నేతలు టిఆర్ఎస్ పార్టీలోకి క్యూ కట్టడంతో మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read also: ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోతే దాని అర్థం తెలుసా..!