Advertisement
ఇండస్ట్రీలో చాలా మంది ఎన్నో కలలని నిజం చేసుకోవాలని వస్తూ ఉంటారు కానీ అందరికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండవు. మ్యూజిక్ డైరెక్టర్లకైనా, దర్శకులుకైనా, నటులకైనా ఎవరికైనా సరే జయ అపజయాలు సహజం. అందరికీ ఎప్పుడూ నిత్యం అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పలేము. ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో బిజీగా ఉన్నవాళ్లు కూడా సడన్ గా ఖాళీ అయిపోతుంటారు. ఫేడౌట్ అయిపోవాల్సి వస్తుంది. అలా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ల వల్ల ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఖాళీ అయిపోయారు. నిజానికి చెప్పాలంటే ఫేడ్ అవుట్ అయిపోయారు.
Advertisement
తమన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజులు లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి వరుసగా సక్సెస్ లని అందుకోవడం జరిగింది. దాంతో మణిశర్మ ఫేడ్ అవుట్ అయిపోవాల్సి వచ్చింది. మణిశర్మ ఆఫర్లన్నీ కూడా తమన్ కి వెళ్ళిపోయాయి. రెండు సంవత్సరాల వరకు మణిశర్మ కి ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు.
Advertisement
మణిశర్మ శిష్యుడు తమన్ వల్లే ఆఫర్లు మొత్తం పోయాయి అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. తమన్ వలన మణిశర్మ చిన్న సినిమాలతో తనెంతో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమిళంలో అనిరుద్ రావడంతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ కి అవకాశాలు బాగా తగ్గాయి. అనిరుద్ మాత్రం వరుస అవకాశాలని పొందుతూ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. హరీష్ జయరాజ్ కి మాత్రం బాగా అవకాశాలు తగ్గిపోయాయి.
Also read: