Advertisement
శ్రియా శరన్, శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. పాపారావు బియ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో యామిని ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ నెల 12న అంటే ఇవాళ విడుదల అయింది. తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
Advertisement
READ ALSO : THE KERALA STORY MOVIE REVIEW IN TELUGU “ది కేరళ స్టోరీ” సినిమా రివ్యూ & రేటింగ్
కథ మరియు వివరణ:
ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను బాగా చదివి డాక్టర్లు కావాలని, లేదంటే ఇంజనీర్లు, ఏదో ఒక జాబ్ చేయాలని మొదటి నుంచి ఒత్తిడి చేస్తూనే ఉంటారు. కానీ వారిలో ఏ కల ఉంది అనేది గుర్తించరు. కేవలం చదువు అంటూ వారికి ఇష్టం లేనిది కూడా వారిపై రుద్ధి ఒత్తిడికి గురిచేస్తారు. అలాంటి బేస్ కథతో ఈ మ్యూజిక్ స్కూల్ సినిమా కథ ఉంది. ముఖ్యంగా పిల్లల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి దాన్ని ప్రోత్సహించడమే ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం. చాలామంది పిల్లలకు సంగీతం, డాన్స్ వంటి ఇతర కళలు ఇష్టం ఉంటాయి.
Advertisement
ఆ కలలను ప్రోత్సహించి వారిని అందరూ తీర్చిదిద్దాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ పాపారావు బియ్యాల. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే…కిరణ్ డియాన్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోవాలోని కొన్ని సన్నివేశాలు, కొన్ని పాటలను పర్వాలేదనే విధంగా చిత్రీకరించారు. లైటింగ్ బ్యాక్ డ్రాప్, కలర్ కాంబినేషన్ లాంటి విషయాలు సన్నివేశాలను, సినిమాను రిచ్ గా కనిపించేలా చేసింది. ఇక ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ చాలా దారుణంగా ఉంటుంది. పాటలు ఈ సినిమాకు పూర్తిగా మైనస్. కథలో డెప్త్ లేకపోవడం వల్ల పాటలు సింక్ కాలేకపోయాయి.
పాజిటివ్ పాయింట్స్:
నటీనటుల యాక్టింగ్
నెగటివ్ పాయింట్స్:
కథ
సాగదీత
రేటింగ్ : 2/5
READ ALSO : Naga Chaitanya Custody Review in Telugu: నాగచైతన్య “కస్టడీ” సినిమా రివ్యూ & రేటింగ్