Advertisement
లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు. అలా నేర్చుకుంటేనే జీవితం బాగుంటుంది ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి 30 ఏళ్లలో ఉపయోగి స్కిల్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. 30 లోగా ఈ స్కిల్స్ ని నేర్చుకోవడం మాత్రం మర్చిపోకండి. 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఎంతో కీలకం. జీవితం ఎలా ఉండాలో నిర్ణయించే సమయం ఇదే. కాబట్టి మీ కెరీర్ ని వ్యక్తిగత భాగస్వామిని నిర్ణయించే తరుణం. ఈ సమయంలో కొన్ని సామాజిక స్కిల్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యం సమాజంలోని విభిన్న సంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీ చుట్టూ విభిన్న చోట్ల నుండి వచ్చిన వాళ్ళతో కనెక్షన్ బాగుంటుంది.
Advertisement
అలాగే ఎంతో పవర్ఫుల్ స్కిల్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్. ఇది తప్పక నేర్చుకోవాలి అప్పుడే మీలో ఉన్న ఆలోచనలు భావవ్యక్తీకరణ బయటపడతాయి క్రియేటివిటీ కూడా మీలో పెరుగుతుంది. ఏదైనా గొడవ జరిగితే దానిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. సమస్యను అవకాశంగా మార్చుకుని ఎదగడానికి ట్రై చేయాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఒక టీం గా పనిచేస్తున్నప్పుడు చిరునవ్వుతో ఉండాలి. అదే మీ బలం అవ్వాలి. ఎమోషన్స్ బయట పెట్టకూడదు.
Advertisement
Also read:
ఎదుట వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు కొట్టి పడేయద్దు. వినండి. దీని వలన మీ వ్యక్తిత్వం ఉన్నతంగా మారచ్చు. ఎదుట వ్యక్తిని కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే 20ల వయసులోనే నాయకత్వ లక్షణాలు అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం దీనివలన మీరు టీంలో లీడ్ గా ఉండొచ్చు. అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి ఇది మేనేజింగ్ స్కిల్స్లో ఒకటి. ఎమోషన్స్ ని గ్రహించడంతో వివిధ పరిస్థితులు ఎలా ప్రవర్తించాలో మీకు తెలుస్తుంది. మీకు ఎవరైనా సహాయం చేసిన లేదంటే ఎవరైనా మంచి పనులు చేసినప్పుడు కృతజ్ఞతలు చెప్పడం ప్రశంసించడం చాలా ముఖ్యం. అప్పుడే పాజిటివ్ వాతావరణం ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!