Advertisement
ఈ మధ్య కాలంలో కొన్ని ప్రేమ జంటలు నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. కొంత మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత వివాదాలు అయితే.. మరికొంత మంది పెద్దలు కుదిర్చిన పెళ్లి లో కూడా వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఎక్కువగా విడిపోతున్నారని చెప్పాలి. కోలీవుడ్ బుల్లితెర జంట విష్ణుకాంత్-సంయుక్త వీరి వివాహ బంధం రెండు నెలలకే తెగిపోయింది. ఇక అప్పటి నుంచి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ట్రెండింగ్ సృష్టిస్తున్నారు. తాజాగా మరో జంట కూడా వార్తల్లో నిలుస్తోంది. గత ఏడాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ జంట.. కేలడీ కన్మణీ సీరియల్ లో నటించిన ఆర్మవ్ తో సెవ్వంధీ సీరియల్ నటి దివ్య శ్రీధర్ ప్రేమలో పడింది. వీరిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకొని గత ఏడాది రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ అనూహ్యంగా దివ్య గర్భిణీగా ఉన్న సమయంలోనే విడిపోయారు.
Advertisement
దివ్యకి గతంలో పెళ్లి జరిగి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తన దగ్గర దాచి తనను పెళ్లి చేసుకుంది అంటూ ఆర్నవ్ ఆరోపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆర్నవ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెల్లమ్మ సీరియల్ సహనటితో ఆర్నవ్ ప్రేమలో పడ్డాడని.. దాని గురించి అడిగితే గర్భవతి అని కూడా చూడకుండా తన కడుపై కొడితే రక్త కారినట్టు తెలిపింది దివ్య. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా.. బెయిల్ పై విడుదలయ్యాడు. ఆర్నవ్ కూడా దివ్యపై పలు ఆరోపణలు చేస్తూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇటీవలే పండంటి పాపకి జన్మనిచ్చింది దివ్య. తాాజాగా మరోసారి ఆర్నవ్ పై సంచలన ఆరోపణలు చేసింది. శ్రీలంక కి చెందిన ఓ యువతితో జిమ్ లో పరిచయం పెంచుకొని.. ప్రేమ అని చెప్పి గర్భవతి అయిన తరువాత మొహం చాటేశాడని వెల్లడించింది. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా బయటపెట్టింది దివ్య.
Advertisement
ఇలా ఆర్నవ్ ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడని.. ఈ మేరకు ఆడియో క్లిప్ ను అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనను తానే గే గా పరిచయం చేసుకొని ఓ పైలట్ నుంచి డబ్బులు తీసుకొని మోసం చేయడమే కాకుండా అతని చావుకు కూడా కారణమయ్యాడని ఆరోపించింది. ఆ బాధితులందరూ తనకు ఇన్ స్టా వేదిక ద్వారా రహస్యాలు వెల్లడిస్తున్నారని పేర్కొంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా వెల్లడించింది. ఓ ఆడియోలో ఓ ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ.. ఆర్నవ్ పదేళ్ల కిందటే తనను పెళ్లి చేసుకున్నాడని.. కొన్నాళ్ల పాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. ఇక ఆ తరువాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడు అని.. దాదాపు ఎనిమిదేళ్లు అతని వేధింపులు భరించినట్టు చెప్పుకొచ్చింది దివ్య.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రియురాలు ఏం చేసిందో తెలుసా ?
మీకు ఆర్థిక ఇబ్బందులా ? అయితే ఐదు సోమవారాలు శివుడికి ఈ పూజ చేసి చూడండి..