Advertisement
పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు. పూర్వకాలంలో పెళ్లి చేయాలంటే పెద్దలు మాత్రమే అమ్మాయిని చూసి పెళ్లి డిసైడ్ చేసేవారు. చివరికి అమ్మాయి పెళ్లి పీటల మీదకి వచ్చేవరకు కూడా అబ్బాయిని కనీసం చూసేది కాదు. అలా పెద్దలు కుదిర్చిన పెళ్లిలే చేసుకొని జీవించి ఉన్నంతకాలం ఉన్నంతలో పిల్లాపాపలతో హ్యాపీగా ఉండేవారు. కానీ ప్రస్తుతం పెళ్లి అంటే నూరేళ్ల మంటగా మారింది. అబ్బాయిలు ఏ విధంగా బయట తిరుగుతున్నారో, అమ్మాయిలు కూడా అదే విధంగా బయటకు వచ్చి అన్ని విధాల జాబులు చేస్తున్నారు. దీంతో అబ్బాయి కింద అమ్మాయి అనిగిమనిగి ఉండాలని ఆప్షన్ లేదు. అయితే ఒక వ్యక్తి తన భార్యలో కొన్ని లక్షణాలు గమనించి వేరే వారితో రిలేషన్ లో ఉందని అనుమాన పడుతున్నాడు.. ఆయన చెబుతున్న లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
నాకు వివాహమై మూడు సంవత్సరాలు అవుతుంది. ఒక పాప కూడా పుట్టింది. మూడేళ్ల నుంచి నా భార్య ఇంటి వద్ద ఉంది. ప్రస్తుతం అకౌంటింగ్ జాబుకు వెళ్తోంది. నేను కూడా జాబ్ చేస్తాను. జాబ్ చేస్తే ఓకే కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతోంది, నేను పడుకున్న తర్వాత కూడా ఫోన్లో చాటింగ్ చేస్తోంది. ఆఫీసులో కూడా తన కొలీగ్స్ తో చాలా క్లోజ్ గా మువ్ అవుతుంది. అంతకు ముందులా నా భార్య లేదు మేడం అంటూ ఒక బాధితుడు అడిగాడు.
Advertisement
నిపుణుల సమాధానం:
సాధారణంగా ఆఫీస్ జాబ్ అంటే సైలెంట్ గా ఉంటే నడవదు. అందరితో కాస్త క్లోజ్ గా ఉంటుంది అంటే అది ఏవిధంగా క్లోజ్ గా ఉంటుందో మీరు గమనించాలి. ఒకవేళ ఆమె శారీరకంగా కూడా క్లోజ్ గా ఉన్నట్టయితే తప్పు చేసినట్టే. అయితే కొంతమంది ఇంట్లో ఉండి ఉండి బయటకు వెళ్లిన తర్వాత కాస్త స్వతంత్రంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కాస్త స్వేచ్ఛ కోరుకుంటారు. తప్పయితే చేయరు.. అయితే ఒకవేళ మీరు తప్పు చేస్తున్నప్పుడు చూసినట్టయితే ముందుగా వారి పేరెంట్స్ ను మీ పేరెంట్స్ ను కూర్చోబెట్టి అడగండి. అసలు విషయాన్ని తెలుసుకోండి. ఇందులో ఆమె తప్పు చేసినట్టు తెలిస్తే తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీ బిడ్డ భవిష్యత్తు నాశనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- బెంగళూరు భానురేఖ మరణానికి కారణం క్యాబ్ డ్రైవరేనా..ఒక్క నిమిషంలో అలా చేశాడా..?
- బ్రేకప్ అయిన మూడేళ్ల తర్వాత..మాజీ లవర్ కి దిమ్మ తిరిగే షాకిచ్చిన ప్రియుడు..!!
- ప్రేమన్నాడు..పెళ్లి పేరుతో నమ్మించాడు.. అన్ని కానిచ్చి చివరికి..!!