Advertisement
నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలని తెరకెక్కించారు. మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగబాబు ఒకపక్క సినిమాల్లో నటిస్తూ ఇంకోపక్క పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పుడప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించి సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేస్తూ ఉంటారు. ఆ పార్టీలపై విమర్శలు చేసే వారిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మండిపడుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా నా డైరీలో ఒక పేజీ అనే ప్రోగ్రాం ని నిర్వహిస్తున్న నాగబాబు రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బి ఆమితాబ్ బచ్చన్ గురించి ప్రేక్షకులతో కొన్ని విషయాలని పంచుకున్నారు.
Advertisement
Advertisement
అవకాశాల కోసం ఆమితాబ్ ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ఆమితాబ్, రాజీవ్ గాంధీ మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వలన వారి ఇంటికి వెళ్తుండే వారిని చెప్పారు. ఒకసారి ఇందిరా గాంధీ గారితో రికమండేషన్ లెటర్ ఇవ్వమని ఆమితాబ్ అడిగారు. ఈ అబ్బాయి నాకు బాగా తెలిసిన అబ్బాయి. బాగా యాక్ట్ చేస్తాడు ట్రై చేయండి అని ఇందిరాగాంధీ లెటర్ రాసిచ్చారు. అయినా కూడా అవకాశాలు రాలేదట.
Also read:
పైగా అమితాబ్ తండ్రి సాధారణ వ్యక్తి కాదు. ఆయన తండ్రి హరివంశరాయ బచ్చన్ హిందీ సాహిత్య రంగంలో అద్భుతమైన పేరు కలిగి ఉన్నారు. చిరంజీవి దగ్గరి నుంచి మా ఇంట్లో వాళ్ళు అందరూ ఆమితాబ్ ఫ్యాన్స్ అని నాగబాబు చెప్పారు. ఒక్కోసారి పవన్ ని ఏడిపించడానికి ఆమితాబ్ గారిని సరదాగా విమర్శించే వాళ్ళం అని నాగబాబు చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ కి విపరీతమైన కోపం వచ్చి ఇంట్లో ఉన్న వస్తువుల్ని విసిరేసేవారట.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఏవి చూడండి!