Advertisement
చాలామంది నటులు తోటి నటులను పెళ్లి చేసుకోవడం మనం ఎప్పటి నుండో చూస్తున్నాం. నాగచైతన్య సమంతల జోడి చాలా క్యూట్ గా ఉంటుంది. చాలా మందికి వాళ్ళు ఫేవరెట్ కపుల్. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ విడిపోయారు. వీళ్ళ పెళ్లికి ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. పెళ్లయిన కొన్నాళ్లకే సమంత నాగచైతన్య విడిపోయారు. 2017 లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి ఏడేళ్ల పాటు సాగింది.
Advertisement
2017 అక్టోబర్ 6న గోవాలో పెళ్లి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు బానే గడిచింది. కానీ అక్టోబర్ 21న విడిపోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. చాలాసార్లు సమంత నాగచైతన్య విడిపోతున్నట్లు పుకార్లు వచ్చాయి. ఇవన్నీ మామూలే అని అంతా లైట్ తీసుకున్నారు కానీ వారు నిజంగానే విడిపోయారు. విడిపోవడం వారి వ్యక్తిగత నిర్ణయం అయినా సోషల్ మీడియాలో మాత్రం నింద భరించింది సమంత.
Advertisement
Also read:
నాగచైతన్యకి అన్యాయం చేసింది అది చేసిందని ట్రోల్స్ కి గురైంది. వాళ్ళిద్దరూ మాత్రం పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేసుకున్న కూడా సమంతని అందరూ పొడిచారు ఇంకా పొడుస్తూనే ఉన్నారు. నాగచైతన్య సమంతలు విడిపోవడానికి కారణం శోభిత దూళిపాళ్ల అనే హీరోయిన్ అని అప్పట్లో చర్చ కూడా నడిచింది. చైతన్యకి ఆమెకు అఫైర్ ఉందని అందుకే ఈ జంట విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. ఈ పుకార్లన్నీ నిజం చేస్తూ నాగచైతన్య శోభిత పెళ్ళికి రెడీ అయ్యారు. ఈ రోజు నిశ్చితార్థం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!