Advertisement
నాగచైతన్య, సమంతకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. విడాకులు ఇచ్చిన ఏడాదికే ఇంకో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె ఎవరో కాదు మనందరికీ తెలిసిందే శోభిత. శోభిత, నాగచైతన్యల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న. వీళ్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా చైతన్య శోభితలు కలిసి సినిమాల చేస్తాడా లేదా అనే వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే చైతన్య ముందు పెళ్లి చేసుకున్న సమంత కూడా ఒక హీరోయిన్.
Advertisement
వీళ్లిద్దరూ ఏ మాయ చేసావే సినిమాలో నటించారు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మజిలీ, మనం, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలు చేసారు. దీంతో వీళ్లిద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా మారింది. అది పెళ్లి వరకు తీసుకువెళ్లింది. ఇప్పుడు చైతు శోభిత ఒక సినిమా కూడా చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం పెళ్లి దాకా వెళ్ళింది దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తారా చేయరా అనే టాక్ నడుస్తోంది.
Advertisement
Also read:
తాజాగా ఓ కార్యక్రమంలో చైతన్య దీని గురించి సమాధానం చెప్పారు. సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితతో కలిసి సినిమా చేస్తారా అని అడిగితే ఇప్పుడు అలాంటి ప్లాన్స్ లేవని నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం తండేల్ సినిమాతో చైతన్య బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో మూవీ విడుదల కాబోతోంది. చైతన్య ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!