Advertisement
Naga Chaitanya Custody Review in Telugu: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. బంగార్రాజు వంటి హిట్ మూవీ అనంతరం వీరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది. ఇందులో అరవింద్ స్వామి విలన్ గా చేశారు. అలాగే ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వరాలు అందించారు. మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చిన కస్టడీ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: ADIPURUSH MOVIE DIALOGUES TELUGU AND ENGLISH ఆదిపురుష్ డైలాగ్స్
Naga Chaitanya Custody Review in Telugu: కథ మరియు వివరణ:
మోరంపూడి అనే గ్రామంలో ఓ యాక్సిడెంట్ తో ఈ సినిమా మొదలవుతుంది. ఈ కస్టడీ మూవీలో ఓ నిజాయితీగల కానిస్టేబుల్ ఆఫీసర్ శివ పాత్రలో నటించాడు నాగచైతన్య. ఇక రేవతి పాత్రలో నటించింది కృతి శెట్టి. అయితే తను ప్రేమించిన రేవతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు శివ. ఓ రోజు శివ పని చేస్తున్న సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో రాజన్న ( అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు. అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న శివ కి రాజన్నని ఎవరో చంపబోతున్నారనే విషయం తెలుస్తుంది. దీంతో ఎలాగైనా రాజన్నని కాపాడాలని అనుకుంటాడు శివ. మరోవైపు తను ప్రేమించిన రేవతికి వేరే పెళ్లి నిశ్చయించారని శివకి తెలుస్తోంది. అయినప్పటికీ ఎలాగైనా రాజన్నని కోర్టులో అప్పగించేందుకు అదే రాత్రి రాజన్న తో పాటు రేవతిని కూడా తీసుకొని వెళతాడు శివ. ఆ సమయంలో శివ, రాజన్న కోసం అటు పోలీసులు, ఇటు రాజన్నని చంపాలనుకున్నవారి వెతుకులాట జరుగుతుంది. అయితే రాజన్నని ఎవరు చంపాలనుకున్నారు..? ఎందుకు చంపాలి అనుకున్నారు..? శివ రాజన్న ని ఎలా కాపాడి కోర్టులో అప్పజెప్పాడు..? తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడా..? లేదా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా, అటు తమిళపేక్షకులకి అనుగుణంగా అందంగా ప్రజెంట్ చేశారు. అయితే కథ, కథనం అంతా బాగున్నప్పటికీ చిత్రంలో అక్కడక్కడ తమిళ్ నేటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నటనపరంగా నాగచైతన్య, అరవింద్ స్వామి ఇరగదీశారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది కానీ పాటలు అంతగా ఆకట్టుకునే విధంగా లేవు. యాక్షన్ సన్నివేశాలు పరవాలేదనిపించాయి. ఇక కృతి శెట్టి గ్లామర్, శరత్ కుమార్ నటనతో పాటు మిగిలిన తారాగణం కూడా వారి పాత్రల మేరకు బాగానే చేశారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఇంటర్వెల్ నుండి కథపై కాస్త ఆసక్తిని కలిగించారు కానీ.. ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కాస్త అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి. దీంతో కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ ఆసక్తి కలిగించలేకపోయాయి. ఫస్ట్ ఆఫ్ బాగా బోరింగ్ గా అనిపించడంతో ఆడియన్స్ సెకండ్ హ్యాండ్ లో పెద్ద మిరాకిల్ జరగాలని అనుకుంటారు. కానీ అది కూడా జరగలేదు.
ప్లస్ పాయింట్స్:
కథ
చైతు, అరవింద్ స్వామి
యాక్షన్
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
సాంగ్స్
ఔట్ డేటెడ్ సీన్స్
రేటింగ్: 2.5/5
Read also: THE KERALA STORY MOVIE REVIEW IN TELUGU “ది కేరళ స్టోరీ” సినిమా రివ్యూ & రేటింగ్