Advertisement
అక్కినేని నాగార్జున నాగేశ్వరరావు బాట లోనే సినిమాల్లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా సినిమాల్లో నటిస్తూ అందరినీ మెప్పించారు నాగార్జున. నాగార్జున తర్వాత తన కొడుకుల్ని కూడా సినిమాల్లోకి తీసుకువచ్చారు. అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ వచ్చారు. నాగచైతన్య తండ్రి బాటలోనే నడుస్తున్నాడని వార్తలు అయితే వస్తున్నాయి. సినిమాల విషయంలోనే కాదు పర్సనల్ గా కూడా తండ్రిని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య సమంతని పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే సమంతకి నాగచైతన్య కి మధ్య సెట్ కాలేదని వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. అయితే ఇప్పుడు నాగచైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Advertisement
Advertisement
నాగచైతన్య తండ్రి నాగార్జున ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తనకంటూ గుర్తింపుని తెచ్చుకున్నాడు. జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తర్వాత ఏ మాయ చేసావే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగచైతన్య, సమంత ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరూ అనేవారు. వాళ్ళని ఆదర్శంగా చాలామంది తీసుకున్నారు. కానీ వీళ్లు విడిపోవడం అందరికీ అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. గత కొద్ది రోజుల నుండి నాగచైతన్య రెండవ పెళ్లి పై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి ఇప్పటివరకు చైతన్య వీటి పై స్పందించలేదు. అక్కినేని నాగార్జున మొదటి భార్య కొడుకు నాగచైతన్య విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటున్నడని ఎన్నో వార్తలు వచ్చాయి.
నాగచైతన్య శోభిత దూళిపాళ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి అయితే అందులో నిజం లేదని ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా నాగచైతన్య ని రెండో పెళ్ళికి నాగార్జున ఒప్పించారట. ఈసారి నాగచైతన్య కూడా ఒప్పుకున్నాడని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. నాగార్జున దూరపు బంధువుల అమ్మాయిని తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య తండాలనే సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య కి పెద్దగా సినిమాలు కలిసి రావట్లేదు. పెద్ద హిట్ కోసం ట్రై చేస్తున్నాడు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!