Advertisement
తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ వ్యవహారం అనేక రూమర్లకు, గాసిప్స్ కి దారి తీస్తోంది. కొద్ది కాలంగా వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ వ్యవహారం రెడ్ హ్యాండెడ్ గా తెలిసినా వేగంగా నిశ్చితార్థం జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అక్కినేని, ధూళ్ళిపాళ్ల కుటుంబాలు మాత్రం ఎవరు ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత చైతు శోభిత పెళ్లికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
Advertisement
ఇక వీళ్ళ పెళ్లి ఎప్పుడు ఎక్కడ పెళ్లి జరుగుతుంది అనేది చూస్తే.. సమంత తో బ్రేకప్ తర్వాత శోభితతో కలిసి చైతు లండన్ లోని ఓ రెస్టారెంట్లో దిగిన ఫోటోతో వాళ్ళిద్దరూ ఎఫైర్ బయటపడింది, తర్వాత వాళ్ళిద్దరూ గురించి అనేక వార్తలు అయితే వచ్చాయి. గాసిప్స్, వార్తల మధ్య ఆగస్టు రెండో వారంలో అకస్మాత్తుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. శోభిత నాగచైతన్య పెళ్లి విషయంపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.
Advertisement
Also read:
వీళ్లిద్దరి పెళ్లి మాత్రం తండేల్ మూవీ రిలీజ్ అయ్యాక జరుగుతుందని తెలుస్తోంది. చైతు, శోభితల పెళ్లి మాత్రం ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కానీ జరిగే అవకాశం ఉంది. పెళ్లి ఇండియాలోని రాజస్థాన్లో కాని ఫారిన్ లో కానీ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైతు తండేల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు కొన్ని ప్రాజెక్టుల చర్చల దశలో ఉన్నాయి. శోభిత బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!