Advertisement
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన యువ నటుడు నాగశౌర్య ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.ప్రమఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఆయన వివాహం నవంబర్ 20న ఉదయం 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Advertisement
నాగశౌర్య, అనూష పెళ్లి వేడుకకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఎంతోమంది నెటిజనులతో పాటు సెలబ్రిటీలు సైతం, సోషల్ మీడియా వేదికగా ఈ నూతన దంపతులకు విషెస్ చెబుతున్నారు. నాగశౌర్య వివాహానికి టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం నాగశౌర్య, అనూష శెట్టి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
Advertisement
ఇలా పెద్దల సమక్షంలో ఈ హీరో ఎంతో అంగరంగ వైభవంగా తన వివాహాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం ఈయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అనూష శెట్టి గులాబీ రంగు చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబయి ఉండగా, నాగశౌర్య మాత్రం పట్టు పంచ ధరించారు. ఇలా సాంప్రదాయ బద్దంగా వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఇక ఈయన పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
READ ALSO : Gaalodu Movie 3 Days Collections : మొదటి వీకెండ్ కుమ్మేసిన ‘గాలోడు’ కలెక్షన్స్.!