Advertisement
Naga Shourya Wife, Name, Photos: రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ఇటీవల కృష్ణ వ్రిందా విహారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదనిపించుకున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నాగ శౌర్య ఈనెల 20వ తేదీన కర్ణాటక కి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆదివారమే నాగశౌర్య – అనూష ల వివాహం బెంగళూరులోని ప్రముఖ హోటల్ లో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది.
Advertisement
Read also: చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు
కర్ణాటక కు చెందిన అనూష శెట్టిది మంగళూరు దగ్గరలోని కుందాపుర్. ఇంటీరియర్ డిజైనింగ్ లో నిష్ణాతురాలైన అనూష ఉమెన్ అచీవర్స్ లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూష తో నాగశౌర్యకు బెంగళూరులో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి వార్త మీడియాకు తెలిసిన దగ్గర నుంచి నాగశౌర్య కట్నం ఎంత తీసుకున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి వరకట్నం తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ కొందరు తీసుకుంటున్నారు.
Advertisement
ఆడ పెళ్లి వారు కూడా వరకట్నం ఇవ్వడం అనేది ఒక మర్యాదగా భావిస్తున్నారు. ఇక ఇలా వరకట్నం తీసుకోవడంలో స్టార్ హీరోలు సైతం అతీతం కాదు. మరి నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడు అంటే.. కోట్లకు అధిపతి అయిన అనుష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. నాగశౌర్యకి కట్నంగా అనూష తల్లిదండ్రులు కొన్ని ప్రాపర్టీస్ తో పాటు 50 కోట్ల వరకు డబ్బు ముట్టచెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగశౌర్య – అనూష లది ప్రేమ పెళ్లి కాబట్టి నాగశౌర్య కట్నం తీసుకోలేదని కొందరు అంటుంటే.. కొందరు కట్నం రూపేనా కాకపోయినా బహుమతుల రూపేనా తీసుకొని ఉండవచ్చనే వాదన చేస్తున్నారు.
Also Read: ప్రేమంటే ఇదేరా.. హీరోయిన్ పాదాలను పట్టుకొని ఏడ్చిన ప్రియుడు..!!