Advertisement
సినిమాల వల్ల రాయలసీమ వెనుకబడిపోయిందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు జనసేన నేత, నటుడు నాగబాబు. సినిమాలు చూస్తే ప్రజలు చెడిపోతారు అంటూ జరుగుతున్న ప్రచారంపై కరెక్ట్ కాదన్నారు. హింస వల్ల ప్రజలు చెడిపోతారంటే.. మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల బాగుపడాలి కదా అంటూ లాజిక్ గా ప్రశ్నించారు.
Advertisement
ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన నాగబాబు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘సినిమాల్లో చూపించే వైలైన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే, మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. ఒక ఫిల్మ్ మేకర్ గా నా దృష్టిలో ఒకటి మాత్రం నిజం. సినిమాలు ఎంటర్ టైన్ మెంట్ కోసమే. జనాన్ని బాగు చెయ్యటం కోసమో, చెడగొట్టాడం కోసమో తేసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ. ఇట్స్ జస్ట్ ఏ బిజినెస్. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇదే నా ఆన్సర్. సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే సెన్సార్ ఉంది. కుహనా మేధావులు ఏడవకండి’’ అంటూ చమత్కరించారు నాగబాబు.
రెండు రోజుల క్రితం రాయలసీమ నష్టపోవడానికి, తమకు అన్యాయం జరగడానికి రాజకీయ నాయకులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా కారణమని ఆరోపించారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించారని అంటున్నారు.
ఇంకా బైరెడ్డి ఏమన్నారంటే..
Advertisement
తమను సినిమాల్లో రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులుగా చూపించి.. సీమకు పెట్టుబడులు రాకుండా చేశారన్నారు. ఓ ప్రాంతం మీ కళ్ల ముందు నాశనం అవుతుంటే సిగ్గు లేకుండా సినిమాలు తీసి తమ జీవితాల్ని, భవిష్యత్తును లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ తమ ప్రాంతం వారు హైదరాబాద్ కు, లేక చెన్నైకి వలస వెళ్లి బతికే పరిస్థితి కొనసాగుతోందన్న బైరెడ్డి.. నిరుద్యోగ సమస్య దేశంలో ఎక్కడా లేనంతగా సీమలో ఉందన్నారు. ఇకపై సీమ ఫ్యాక్షన్ అంటూ సినిమాలు తీస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమకు భవిష్యత్ లేకుండా పోతుంటే, మీరు మాత్రం కాసులు లెక్కబెట్టుకుంటారా? అంటూ ఫైరయ్యారు. తమ ప్రాంతంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారని వాళ్ల గురించి సినిమాలు ఎందుకు తీయరని ప్రశ్నించారు బైరెడ్డి. రాయలసీమ వాళ్లంటే భయపడే పరిస్థితిని సినిమా వాళ్లు తీసుకొచ్చారని విమర్శించారు. 75 ఏళ్లుగా రాయలసీమ మోసపోతూనే ఉందన్నారు బైరెడ్డి. ‘‘హోస్పేట డ్యామ్, బళ్లారి జిల్లా పోయింది. వచ్చింది అనుకున్న రాజధాని మూడేళ్లకే పోగొట్టుకున్నాం. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి, బ్యారేజ్ నిర్మించాలి. దాంతోపాటు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల వల్ల జరిగిన నష్టం తమను బాధిస్తుంటే, సీమ ఫ్యాక్షనిజం అంటూ తీస్తున్న సినిమాలు తమకు మరింత నష్టాన్ని చేకూర్చాయని అన్నారు బైరెడ్డి.