Advertisement
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఒక పక్క సినిమాలు ఇంకో పక్క రాజకీయాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నిటిని చూసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో సపోర్ట్ ఇచ్చారు. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా ఎంతో మద్దతు ఇస్తున్నారు. త్వరలోనే ఒక న్యూస్ ఛానల్ పెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి.
Advertisement
తాజాగా ఎన్ మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఎన్ మీడియా లోగో రివిల్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి ఎన్ ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా మొదలుపెట్టారు. ఈ మీడియా ద్వారా న్యూస్ హెల్త్ భక్తి న్యూస్ మాత్రమే ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Also read:
Also read:
భవిష్యత్తులో తన మీడియా ఛానల్స్ లో మరింత అభివృద్ధి చేయబోతున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ న్యూస్ తో పాటుగా వెబ్సైట్ కూడా స్థాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ మీడియాని స్థాపించి మళ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ ఈ ఛానల్ ద్వారా పొలిటికల్ న్యూస్ కూడా ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!