Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి పేరు సంపాదించుకున్న బ్యూటీ సమంత. ఇటీవల ఈ అమ్మడు అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుందని చెబుతూ అధికారిక ప్రకటన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె ప్రకటన చేసినప్పటి నుంచి ఆమె అనారోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్ చేయడం మనం చూసాం. అయితే ఇంత జరుగుతున్నా మాజీ భర్త నాగచైతన్య నుంచి మరియు నాగార్జున కుటుంబం నుంచి గాని ఈ విషయం మీద ఎలాంటి స్పందన లేకపోవడంపై సమంతా అభిమానులు మండిపడుతున్నారు.
Advertisement
also read:ఉదయ్ కిరణ్ మరణానికి చిరంజీవికి సంబంధం లేదు.. తేల్చి చెప్పిన తేజ..!
Advertisement
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా నాగచైతన్య హాస్పిటల్ కి వెళ్లి సమంతని ఓదార్చాడని ఒక వార్త,ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని మరో వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత నాగచైతన్య విడాకుల రద్దు విషయంపై నాగార్జున రియాక్ట్ అయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే నాగచైతన్యతో నాగార్జున విడాకులు రద్దు చేసుకోవాలని సూచన చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఆమె అనారోగ్య పరిస్థితులలో నీ తోడు చాలా అవసరమని నాగార్జున అన్నారని వార్త ప్రచారం అవుతుంది.
అంతేకాకుండా ఆమె మనసుకు దగ్గరైన వ్యక్తి నువ్వే కాబట్టి తోడుగా ఉండాలని నాగార్జున సూచించారంటూ సోషల్ మీడియా వేదికగా వార్త వైరల్ అవుతుంది. అయితే సమంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇదంతా వట్టి ప్రచారమే అని ప్రస్తుతానికి నాగచైతన్య నుంచి కానీ నాగార్జున కుటుంబం నుంచి కానీ ఎలాంటి పరామర్శ లేదని, ఒకవేళ ఫోన్ లో పరామర్శి ఉండవచ్చు కానీ నేరుగా పరామర్శించడానికి దాఖలాలు లేవని వారు వెల్లడించారు. మరి ఇదే విషయంపై సమంత నాగచైతన్య స్పందిస్తే గాని అసలు విషయం బయటకు రాదు.
also read: