Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరోలలో ఒకరైనా మాస్ మహారాజా రవితేజ అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి తెలుగు ఇండస్ట్రీలో హీరోగా దూసుకుపోతున్నారు. అలాంటి స్టార్ హీరో కొంతకాలం వరుస ప్లాపులతో సతమతం అయినా క్రాక్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. కానీ ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కిలాడి సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు. తాజాగా శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ.
Advertisement
ఈ మూవీ జూలై 29 థియేటర్ లోకి వచ్చింది. కానీ వచ్చిన మొదటి రోజు నుంచే ఈ మూవీ నెగిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మూవీ కథ బాగానే ఉన్నప్పటికీ, అది రవితేజ ఇమేజ్ కి సూటయ్యే కథ కాదని చాలామంది అనుకుంటున్నారు. శరత్ మండవ మైండ్ లో ఉన్న హీరో రవితేజ కాదని, ఈ సినిమా కథ రవితేజ కి ఏమాత్రం సెట్ కాలేదని, చాలా మంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి శరత్ మండవ ఈ మూవీ కథను నాగార్జున ను దృష్టిలో పెట్టుకొని రాశారని తెలుస్తోంది. ఈ కథ ని కూడా ముందుగా నాగార్జున కి వినిపించాడట.
Advertisement
ఈ కథ విన్నాక నాగార్జున ఈ మూవీకి యంగ్ హీరో అయితే బాగుంటుందని, ప్లాష్ బ్యాక్ లో ఉండే లవ్ స్టోరీ కి సెట్ అవుతుందని అన్నారని తెలుస్తోంది. అలా నాగార్జున వదిలేసినటువంటి ఈ కథ రవితేజ చేతుల్లోకి వచ్చింది. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా ఇలాంటి సీరియస్ కథతో రవితేజ ను అభిమానులు చూసి జీర్ణించుకోలేక పోయారు. నాగార్జున చేసిన ఈ సినిమా కొంచెం బెటర్ గా ఉండేదేమో అని చాలా మంది అభిమానులు అనుకుంటూ ఉన్నారట. ఏది ఏమైనా నాగార్జున ఒక ఫెయిల్యూర్ సినిమా నుంచి తప్పించుకున్నారని చెప్పవచ్చు.
ALSO READ:
గ్లామర్ కంటే నటనకు ప్రాముఖ్యత ఇచ్చి, స్టార్లు అయిన హీరోయిన్లు!