Advertisement
1990 వ దశకంలో తెలుగు చిత్రసీమలోకి కొత్త కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేశారు. ఆ సమయంలోనే సినిమారంగం కూడా అనేక కొత్త కోణాలు రూపుదిద్దుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది.ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దివ్యభారతి. ఆమె సురేష్ ప్రొడక్షన్ లోని బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ బొబ్బిలి రాజా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇందులో హీరోగా వెంకటేష్ నటించారు. అయితే ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే దివ్యభారతి కంటే ముందు ఈ సినిమాలో రాధాను హీరోయిన్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పరుచూరి బ్రదర్స్ దివ్య భారతి ని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా తర్వాత దివ్యభారతి చాలా సినిమాల్లో నటించింది. చిరంజీవి దివ్యభారతి కాంబినేషన్ లో రౌడీ అల్లుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Advertisement
తర్వాత మోహన్ బాబుతో చిట్టెమ్మ మొగుడు, దీని తర్వాత బాలకృష్ణ తో ధర్మక్షేత్రం వంటి సినిమాల్లో చేసి ఇండస్ట్రీలో మరింత పేరు సంపాదించింది. అయితే బాలకృష్ణతో చేసినటువంటి ధర్మక్షేత్రం మూవీ బాక్సాఫీస్ వద్ద కాస్త డల్ గా ఉన్న వారి కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. దీని తర్వాత వచ్చిన మూవీ తొలిముద్దు దివ్యభారతి చివరి చిత్రంగా మిగిలింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రశాంత్ మరియు దివ్యభారతి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ప్రమాదవశాత్తు దివ్యభారతి మృతి చెందింది.
Advertisement
దీంతో ఎంతో మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ ఆమె ఎలా చనిపోయింది అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ సమయంలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. అంతే కాకుండా ఆమె పారితోషికం విషయంలో తగ్గేది లేదు అన్నట్టుగా ఉండేదని, దీనివల్ల కూడా నాగార్జున తో నటించే అవకాశం కోల్పోయిందని తెలిసింది. అల్లరి ప్రియుడు, కిల్లర్ వంటి సినిమాలలో దివ్య భారతి ని తీసుకుంటారనే టాక్ ఆ సమయంలో వినిపించింది కానీ, ఆమె అకస్మాత్తుగా మరణించింది. దీంతో ఆ ఛాన్స్ నగ్మాకు వెళ్లిపోయిందని సమాచారం.
also read;
కంప్యూటర్ కీ బోర్డు లో అక్షరాలు ఎందుకు ఆర్డర్ లో ఉండవు ? వాటి అర్థం అదేనా ?