Advertisement
నాగార్జున అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కపాదం మోపింది. కొన్నేళ్లుగా ఈ అక్రమ కట్టడంపై అనేక ఆరోపణలు వచ్చినా.. ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు. అందుకు కారణం ఆయా ప్రభుత్వం నేతలతో నాగార్జునకు ఉన్న సన్నిహిత సంబంధాలు అని తెలుస్తోంది. తాజాగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలో భాగంగా నాగార్జునకు చెందిన కన్వెన్షన్ పై చర్యలు చేపట్టారు. మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలో తుమ్మిడి కుంట ప్రాంతంలో ఓ చెరువుని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారు అనే ఆరోపణలు అప్పట్లో హరీష్ రావు తో సహా ఇతర టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Advertisement
Advertisement
ఆ సమయంలో కూల్చివేతకు సిద్ధం కావడంతో పార్టీలోని కీలక నేతతో ఉన్న సన్నిహిత రిలేషన్స్ వలన అది ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి. సుమారు మూడు ఎకరాలను ఆక్రమించారు. రెండు ఎకరాలు బఫర్ జోన్ లో ఉంది. మరో 1.12 ఎకరాలు చెరువు కిందకి వస్తుంది. చెరువుని ఎవరు ఆక్రమించకుండా రెండు ఎకరాలను బఫర్ జోన్ గా పెడతారు కానీ నాగర్జున ఆ ప్రాంతం కూడా ఆక్రమించి N కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది.
Also read:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూకబ్జాలు అక్రమాలపై దృష్టి పెట్టింది జిహెచ్ఎంసి పరిధిలో అక్రమణాలపై హైడ్రా కొరడా ఝళిపించింది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు నోటీసులు ఇవ్వడం చివరకు లాభంతో లొంగిపోయి వదిలేయడం జరిగింది రేవంత్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపడం పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!