Advertisement
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెప్టెంబర్ 3న ప్రారంభం అయ్యింది. నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 7లో శివాజీ, దామిని భట్ల, ప్రిన్స్ యావర్, షకీల, ప్రియాంక జైన్, ఆట సందీప్, శోభా శెట్టి, శుభశ్రీ రాయగురు, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, రాతికా రోజ్, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి పోటీదారులుగా ఉన్నారు.
Advertisement
బిగ్ బాస్ పుల్టా సీజన్ గురించి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ ఉన్నాయి.. ఫైనల్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదటి ఎపిసోడ్ లాంచ్ అయిన తర్వాత కూడా ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ సారి సీజన్-7లోని కొన్ని రూల్స్ గురించి నాగార్జున క్లారిటీ ఇచ్చినా ఇంకా కంటెస్టెంట్స్ మాత్రం ఈ రూల్స్ విషయంలో కొంచెం అయోమయంలో ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ యాజమాన్యం ఓటింగ్ విషయంలో కూడా చాలామార్పును తీసుకొచ్చింది.
Advertisement
బిగ్ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఆరవ సీజన్ వరకు ఒక్కొక్కరు ప్రేక్షకుడికి పది ఓట్లు వేసే బాస్ అందించారు బిగ్ బాస్ టీం. అలాగే ఆ పది ఓట్లు ఒకే కంటెస్టెంట్‌కు వేయాలా లేకుంటే కంటెస్టెంట్స్‌కు డివైడ్ చేసి వేయాలా అన్న నిర్ణయం ప్రేక్షకులకే వదిలేశారు. మిస్డ్ కాల్ ద్వారా, లేదా హాట్‌స్టార్ ద్వారా ఈ ఓటులను వేసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్ల కంటెస్టెంట్స్‌కు ఫేక్ ఎకౌంట్‌లో ఓట్లు వేస్తున్నారని, ఆ ఓట్ల ద్వారా చివరకు గెలవడంలో కంటెస్టెంట్స్‌కు అన్యాయం జరుగుతుందని ముందు జరిగిన సీజన్లలో చాలామంది ప్రేక్షకుల అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో ‘బిగ్ బాస్’ సీజన్-7లో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఒక ప్రేక్షకుడికి ఒక ఓటు మాత్రమే వేసే అవకాశం మాత్రమే కల్పించింది. హాట్‌స్టార్ ద్వారా లేక మిస్డ్ కాల్ ద్వారా అయినా ఒక ప్రేక్షకుడు ఒక ఓటు వేసే అవకాశం మాత్రమే కల్పించారు బిగ్ బాస్ యాజమాన్యం. ఈ కార్యక్రమంలో నాగార్జున స్వయంగా మొదటి ఎపిసోడ్ చివర్లో ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి:
కులాంతర వివాహాలు చేసుకున్న తెలుగు స్టార్ హీరోలు ఎవరంటే..?
చూసుకోవాలి కదా థమన్ భయ్యా..! మరీ ఇంత ఘోరంగా OG లోకి బిజీమ్ కాపీ చేస్తావా..?
అర్జున్ రెడ్డి హీరోయిన్ ఆసక్తికర పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..!