Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున రెండో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చి లక్షలాది మంది గుండెల్లో గూడు కట్టుకున్నారు. నాగార్జున సినిమాల్లో తనదైన నటనతో అమ్మాయిల గుండెల్లో మన్మధుడి గా చోటు దక్కించుకున్నారు.
Advertisement
అలాంటి అక్కినేని నాగార్జున అతని మొదటి భార్య లక్ష్మికి సంబంధించి కొన్ని రేర్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం..
Nagarjuna First Wife Name, Images
నాగార్జున ఇండస్ట్రీలోకి వెళ్లడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. అలాగే ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే నాగార్జున మొదటి వివాహం మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ హీరో నాగచైతన్య పుట్టిన తర్వాత బేధాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అప్పటికి అమల తో ప్రేమలో పడ్డ నాగార్జున ఆమె ను రెండవ వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన సంతానమే అక్కినేని అఖిల్..
Advertisement
అయితే తాజాగా నాగార్జున అతని మొదటి భార్య లక్ష్మి కి సంబంధించి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నాగార్జున గుర్తుపట్టలేని రీతిలో ఉన్నారు. దీంతో ఆయన అభిమానులు మా హీరో ఇలా ఉన్నాడా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. కొంతమంది మా అభిమాన హీరో ఫోటో చూసే అదృష్టం దక్కింది అని అనుకుంటున్నారు.. ఇటీవల నాగార్జున నాగచైతన్యతో కలిసి తీసిన చిత్రం బంగారు రాజు సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం కింగ్ నాగార్జున వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.
ALSO READ:
స్వర్గీయ Y.S రాజశేఖర్ రెడ్డి అరుదైన ఫోటోస్.. మీరు ఓ లుక్కేయండి..!!