Advertisement
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం పై ఏపీ ప్రజలు మొదట ఆశ్చర్యానికి లోనయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పందించారు. నిరసన తెలియ చేసి, చంద్రబాబుకు తన మద్దతు చూపించారు. ఈ అరెస్ట్ అప్రజాస్వామికం అని పేర్కొంటూ ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు స్పందించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంపై స్పందించారు.
Advertisement
ఇటీవల బాలకృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంపై స్పందించారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం జగన్ సంక్షేమాలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటూ బాలయ్య బాబు మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపు చర్యల తోనే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసారు అంటూ బాలయ్య బాబు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.
Advertisement
ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని పేర్కొన్నారు. జగన్ జైలుకి వెళ్లాడని.. అందరిని జైలుకి పంపించాలని ప్రయత్నిస్తున్నారని నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలకృష్ణ ఇటీవల మంగళగిరి టిడిపి కార్యాలయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తన ఆగ్రహం వ్యక్తం చేసారు. హిందూపురంలో 1200 మందికి ఇచ్చారని, వేల మందికి ఉపాధి కల్పించారని ఇవన్నీ మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? అని ప్రశ్నించారు. అసలు అవినీతి జరిగినప్పుడు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు? సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్ అని.. కక్షసాధింపులే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారని మండిపడ్డారు.
మరిన్ని..
చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి వేణుస్వామి ముందే చెప్పారుగా.. ఆయన జోస్యంలో ఏముందంటే?
కేసుల ఊబిలో చిక్కుకున్న టీడీపీ.. ఎన్నికల ఫలితాల్లో మార్పు? నెక్స్ట్ టార్గెట్ ఏంటి?
ఈ 8 ఆహార పదార్ధాలను పొరపాటున కూడా కుక్కర్ లో వండకండి.. ఎందుకంటే?