Advertisement
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. నారా, నందమూరి ఫ్యామిలీలు నారావారిపల్లెకు వెళ్లి సరదాగా గడుపుతుంటాయి. ఈసారి కూడా ఒకరోజు ముందే అందరూ అక్కడకు చేరుకున్నారు. భోగి వేడుకల్లో సరదాగా సందడి చేశారు. బాలయ్య జాగింగ్ వీడియోలు, భోగి మంటల సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే సంక్రాంతి రోజున కూడా ఇరు కుటుంబాలు వేడుకల్లో పాల్గొన్నాయి.
Advertisement
వేడుకల్లో భాగంగా తిరుపతి నాగాలమ్మకట్ట దగ్గర కొన్ని ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. వెండితెరపై వీరసింహంలా గర్జించిన బాలయ్యను మనవడు దేవాన్ష్ ఓ ఆటాడుకున్నాడు. నీళ్ల బాటిల్ తో సరదాగా కొడుతూ తెగ అల్లరి చేశాడు. అతడి అల్లరి చేష్టలను చూస్తూ ఉండిపోయారు బాలకృష్ణ.
Advertisement
ఇటు చంద్రబాబును సైతం వదలలేదు. నువ్వు కూర్చున్న కుర్చీ కావాలంటూ చంద్రబాబుని లేపేసాడు. మనవడి కోరిక కాదనలేక అక్కడినుంచి లేచి దేవాన్ష్ ను కూర్చోబెట్టారు.
ఆలయం వద్ద మహిళలు పూజలు చేస్తుంటే.. చంద్రబాబు, బాలయ్య మనవడితో ఆటలు ఆడుతూ సరదాగా గడిపారు. అలాగే, నారావారిపల్లెలో తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించారు చంద్రబాబు. భార్యతో కలిసి దుస్తులు పెట్టి తర్పణమర్పించారు. ఇక కనుమ నాడు పీలేరు సబ్ జైలుకు వెళ్ళనున్నారు. అక్కడ జైలుపాలైన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు.