Advertisement
తెలుగు ఇండస్ట్రీలో చాలావరకు సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తుంటారు. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి థియేటర్లోకి వచ్చే సమయం వరకు ముహూర్తం సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. అయితే ఇలాంటి సెంటిమెంట్ల లో నందమూరి హీరోలకు ఈ సెంటిమెంట్ మాత్రం చాలా కలిసి వస్తోంది. అది ఏంటయ్యా అంటే పాప సెంటిమెంట్. బాలకృష్ణ నటించిన అఖండ, ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో కూడా పాప సెంటిమెంట్ చాలా కలిసివచ్చింది.
Advertisement
ఇప్పుడు బింబిసార సినిమాలో కూడా పాప సెంటిమెంట్ చాలా కలిసి వచ్చింది.. బాలకృష్ణ హీరోగా అఖండ మూవీలో సెకండాఫ్ లో చిన్న పాప క్యారెక్టర్ ప్రధానంగా నిలిచింది. ఆ పాప క్యారెక్టర్ ఈ సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసింది. దీంతో మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవడమే కాకుండా సూపర్ హిట్ గా నిలిచింది.
Advertisement
Akhanda Child Artist Deshna Javaji Photos
Twinkle Sharma (Malli RRR)
జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో కూడా బ్రిటిష్ వారు పాపని తీసుకెళ్లడం, పాపని కాపాడడం కోసం ఎన్టీఆర్ అక్కడికి వెళ్లడం ఆడియన్స్ ను చాలా ఆకట్టుకుంది.
దీంతో ఈ మూవీ కూడా సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బింబిసార మూవీలో శాంభవి పాత్ర లో పాప నటించడం సినిమాకు ఒక ప్లస్ గా చెప్పవచ్చు. దీంతో ఈ మూడు సినిమాలు పాప సెంటిమెంట్ వల్ల సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యామిలీ కి పాప సెంటిమెంట్ చాలా కలిసి వస్తుందని ప్రచారం జరుగుతోంది.
ALSO READ;