Advertisement
ఏపీ, తెలంగాణలో వరదలు ముంచేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంలో ఉధృతంగా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ఒక్కసారిగా విజయవాడను ముంచింది. అందుకు ముఖ్య కారణం బుడమేరు డ్రైన్ బఫర్ జోన్లో అన్ని అక్రమ కట్టడాలే కావడంతో ఆధునికరణ ప్రతిపాదనను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. చివరకు విజయవాడ నగరాన్ని ముంచేస్తుంది. అంతేకాకుండా ఖమ్మం ని మున్నేరు ముంచేస్తుంది. నగరం మొత్తం నీట మునిగింది.
Advertisement
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దగ్గరుండి సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రులు సహాయనిధికి ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున పంపించారు. దీంతో వివిధ రంగాల ప్రముఖులు తారక్ పై ప్రశంసలు కురిపించారు.
Advertisement
Also read:
మిగిలిన హీరోలు కూడా ఒక్కొక్కరు ముందుకి వచ్చారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి విరాళం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. తారక్ తో పాటుగా విశ్వక్ సేన్ కి కూడా రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, సిద్దు జొన్నలగడ్డ, అనన్య నాగళ్ళ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ముందుకొచ్చారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!