Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఈ మధ్య కాలంలో ఏపీ అంతటా యాత్రం చేస్తున్న విషయం తెలిసిందే. యువగళం పేరిట ఆయన కొనసాగిస్తున్న యాత్ర వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని గెలిపించాలనే లక్ష్యంతో సాగుతున్నది. ప్రధాన ఆయన వెళ్లిన ప్రతీ చోట యువతతో ముచ్చటిస్తున్నారు. ఇవాళ మంగళగిరిలో ఆయన విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు.
Advertisement
Advertisement
విద్యార్థులు లోకేష్ పై రకరకాల ప్రశ్నలు సంధించారు. రాజకీయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా ఉండటం విశేషం. ఓ టీనేజ్ అమ్మాయి అడిగిన ప్రశ్నకు లోకేష్ కాసేపు సిగ్గుపడ్డారు. జనం కేరింతల మధ్య ఆయన సమాధానం చెప్పారు. ఇంతకు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న దానికి లోకేష్ చెప్పిన సమాధానం ఏంటంటే.. బ్రాహ్మణితో పెళ్లి ప్రస్తావన తొలుత ఎవరు తీసుకొచ్చారు అని ప్రశ్నించింది. ఆ టీనేజ్ అమ్మాయి అడిగిన ప్రశ్నకు కొద్ది సేపు సిగ్గుపడ్డారు లోకేష్. ఇక ఆ తరువాత ఆ ప్రశ్నకు జవాబు చెప్పాడు.
తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని.. తన మామయ్య బాలకృష్ణను అడిగే ధైర్యం తనకు లేదని తేల్చిచెప్పారు. మా ఇద్దరికీ పెళ్లి చేయాలనే ప్రతిపాదనను తొలుత మామయ్య కుటుంబం నుంచి వచ్చిందని.. మా ఇంట్లో వాళ్లు కూడా ఓ రోజు తనకు చెప్పి అభిప్రాయాన్ని కనుక్కున్నారు. ఇక “ నా అభిప్రాయం ఏంటో మీకు తెలుసు కదా” అని చెప్పుకొచ్చారు లోకేష్.