Advertisement
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. 24వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగింది. అయితే.. పోలీసులు తమ యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు లోకేష్. తమ ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దంటూ మీసం మెలేశారు. చంద్రబాబు ఒక చిటికె వేస్తే వైసీపీ మూకల సంగతి ఇప్పుడే చూస్తామని, రౌడీలను కట్ డ్రాయర్ పై ఊరేగిస్తామని హెచ్చరించారు.
Advertisement
చంద్రబాబు గారి ఆదేశాలతో సహనం పాటిస్తున్నామన్న లోకేష్.. ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తున్నామని తెలిపారు. వైసీపీ మూకల్లాగే తామూ తెగిస్తే.. ఆపార్టీకి ఒక్క ఆఫీసూ మిగలదన్నారు. ‘‘రేపు వచ్చేది మేమే.. పోస్టింగులు ఇచ్చేది నేనే.. గుర్తుంచుకోండి’’ అని పోలీసులపైనా మండిపడ్డారు. యువగళం, చంద్రబాబు పర్యటనలకు ఇబ్బందులు పెడుతున్నారని, శ్రీకాళహస్తిలోని బడా చోర్ ఏమేమి దోపిడీ చేస్తున్నాడో తనకు తెలుసన్నారు. ఏపీలో చట్టాలు కొందరికి చుట్టాలుగా మారాయని, తాము వచ్చాక అందరి చరిత్రలు బయటకు లాగుతామని లోకేష్ హెచ్చరించారు.
Advertisement
స్థానిక ఎమ్మెల్యే ఇసుక దోపిడీ చేస్తే కేసు ఉండదు కానీ.. తాను స్టూల్ ఎక్కి మాట్లాడితే మాత్రం కేసు పెడతారా? ఇదేం న్యాయం అంటూ మండిపడ్డారు. మరోవైపు సెల్ఫీలతోనూ వైసీపీని ఆడుకుంటున్నారు లోకేష్. పాదయాత్రలో భాగంగా ఓ చోట వైన్ షాపు కనిపిస్తే.. సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పెట్టారు.
మద్య నిషేధం హామీ: పోయింది
మద్యం అమ్మేవారు: జగన్ & కో
మద్యం మనీ వెళ్తోంది: తాడేపల్లి ప్యాలెస్
మద్యం ధరలు: దేశంలోనే అత్యధికం
మద్యం నాణ్యత: దేశంలోనే అతి తక్కువ, ప్రమాదకరం
ఇలా వైసీపీ సర్కార్ పై సెటైరికల్ ట్వీట్స్ చేస్తున్నారు లోకేష్. అలాగే, తమ పాలనలో వచ్చిన కంపెనీల దగ్గర సెల్ఫీలు దిగి.. జగన్ ఏం తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఓ చోట ఇసుక తవ్వకాలు జరుగుతుంటే.. వైసీపీ బ్యాచ్ విచ్చలవిడిగా ఇసుకను తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు లోకేష్.